హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు 300 మీటర్ల లోయలో పడిన ఘటనలో 33 మంది మరణించారు. మరో 37 మందికి గాయాలయ్యాయి. ఇప్పటివరకు 15 మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మందికిపైగా ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.
చాలా ఎత్తు నుంచి పడడం వల్ల బస్సు నుజ్జునుజ్జు అయింది. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. హృదయ విదారక ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
బంజార్ నుంచి గడా గుషానీ ప్రాంతం వెళ్తుండగా బస్సు లోయలో పడినట్లు తెలిపారు కుల్లు ఎస్పీ. సమాచారం అందిన వెంటనే సహాయ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యల్ని ముమ్మురం చేశాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.