ETV Bharat / bharat

వరదల నుంచి 2400 ఏళ్ల ఈజిప్టు మమ్మీని కాపాడి.. - 2,400-yr-old mummy in Jaipur

భారీ వర్షాలతో మ్యూజియంలోకి వరద నీరు చేరగా.. అందులోని 2,400 ఏళ్ల ఈజిప్ట్​ మమ్మీని రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు సిబ్బంది. నడుములోతు నీళ్లలో సెల్​ఫోన్​ లైట్లతో గ్లాసు అద్దాలు బద్దలు కొట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ సంఘటన రాజస్థాన్​ రాజధాని జైపుర్​లో జరిగింది.

2,400-yr-old mummy in Jaipur enjoys fresh air after 130 years
వరదల నుంచి 2400 ఏళ్ల ఈజిప్టు మమ్మీని కాపాడి..
author img

By

Published : Aug 19, 2020, 6:51 PM IST

రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రజలను రక్షించేందుకు పలు రకాల సహాయక చర్యలు చేపడుతుండగా.. ఓ మ్యూజియం సిబ్బంది మాత్రం ఈజిప్టు మమ్మీని కాపాడేందుకు శాయశక్తులు ఒడ్డారు.

మ్యూజియంలోకి నీరు చేరడంతో గ్లాస్‌ ఛాంబర్‌లో ఉంచిన 2,400 సంవత్సరాల ఈజిప్ట్‌ మమ్మీని పాడవకుండా రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు. మ్యూజియంలోకి చేరిన నడుము లోతు నీటిలో సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో ఛాంబర్‌ గ్లాసును బద్దలు కొట్టి అతి కష్టం మీద మమ్మీని మ్యూజియంలో నీరు చేరని చోటికి తరలించారు.

2,400-yr-old mummy in Jaipur enjoys fresh air after 130 years
2400 ఏళ్ల నాటి ఈజిప్ట్​ మమ్మీ

" 2016 నుంచి ప్రదర్శనకు ఉంచిన 2400 ఏళ్ల ప్రాచీన మమ్మీని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం. దానిని వీక్షించేందుకు దేశ విదేశాలనుంచి ఎంతో మంది సందర్శకులు వస్తుంటారు. ఆ మమ్మీ వెలకట్టలేనిది. మమ్మీకి ఎలాంటి డ్యామేజీ జరగకుండా సకాలంలో దానిని కాపాడాం. వర్షాలు, వరదలు మ్యూజియంలోని 17 వేల కళాఖండాలపై ప్రభావం చూపాయి."

- డాక్టర్​ రాకేశ్​ చోలక్​, మ్యూజియం సూపరింటెండెంట్

జైపుర్​ మ్యూజియం

మ్యూజియంలోని విగ్రహాలు

మ్యూజియంలో తడిసిన దస్త్రాలు

ఇదీ చూడండి: కాంగ్రెస్​లో పదవులపై పైలట్ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.