దేశంలో కరోనా రోజురోజుకూ ఉద్ధృతం అవుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో వైరస్ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
తమిళనాడులో వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఒక్కరోజే 4,807 మంది కరోనా బారినపడ్డారు. మరో 88 మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1,65,714కు చేరగా... 2,403 మంది కరోనాతో చనిపోయారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ మహమ్మారి విస్తరిస్తోంది. శనివారం మరో 1,673 మందికి వైరస్ సోకింది. 24 మందికిపైగా మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 47,036 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 1,108కు చేరింది.
రాజధానిలో తగ్గుముఖం..
దిల్లీలో కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,475 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,21,582కు పెరిగింది. మరో 26మంది మహమ్మారికి బలయ్యారు. దేశరాజధానిలో మొత్తం 3597 మరణాలు నమోదయ్యాయి.
కేరళలో తాజాగా 593మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసులు 11,659కు, మరణాలు 173కు పెరిగాయి.
ఇదీ చూడండి: భాజపా కార్యకర్తలపై తృణమూల్ సభ్యుల దాడి