ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం- 24 మంది వలస కూలీలు మృతి

up accident
ఘోర రోడ్డు ప్రమాదం- 21 మంది వలస కూలీలు మృతి
author img

By

Published : May 16, 2020, 7:04 AM IST

Updated : May 16, 2020, 10:29 AM IST

08:50 May 16

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ నుంచి 50 మంది వలస కూలీలు తమ స్వస్థలాలకు ట్రక్కులో తిరిగి వెళ్తుండగా దిల్లీ నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. తెల్లవారుజామున మూడున్నర గంటలకు జరిగిన ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయపడ్డారు. వారిలో 15 మంది పరిస్థితి విషమించగా.. మెరుగైన చికిత్సకోసం సైఫైలోని  ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా ఉత్తర్​ప్రదేశ్, ఝార్ఖండ్, బంగాల్  రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

ప్రమాదంపై ఉత్తర్​ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించి, ప్రమాద కారణాలపై నివేదిక సమర్పించాలని కాన్పుర్‌ ఐజీని.. యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు.

07:52 May 16

24కు చేరిన మృతుల సంఖ్య...

ఉత్తర్​ప్రదేశ్​ ప్రమాదంలో మృతుల సంఖ్య 24కు పెరిగింది. 22 మంది క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చగా... అందులో 15 మందికి తీవ్ర గాయాలైనట్లు ఔరయ వైద్య అధికారి తెలిపారు. వలస కూలీలు రాజస్థాన్​ నుంచి బిహార్​​, ఝార్ఖండ్​కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

07:21 May 16

ఉత్తర్​ప్రదేశ్​ ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. 15- 20 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ప్రయాణికుల్లో అత్యధికులు బిహార్​, ఝార్ఖండ్​, బంగాల్​కు చెందినవారని తెలుస్తోంది. 

07:16 May 16

ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔరయ వద్ద రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో 21 మంది వలస కూలీలు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వలస కూలీలు రాజస్థాన్‌ నుంచి యూపీకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

07:02 May 16

ఘోర రోడ్డు ప్రమాదం- 21 మంది వలస కూలీలు మృతి

  • ఉత్తర్‌ప్రదేశ్‌: ఔరయ వద్ద ఘోర రోడ్డుప్రమాదం
  • రెండు ట్రక్కులు ఢీకొని 21 మంది మృతి, పలువురికి గాయాలు
  • బాధితులు రాజస్థాన్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌ వెళ్తున్న వలసకూలీలుగా గుర్తింపు 

Last Updated : May 16, 2020, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.