ETV Bharat / bharat

వృద్ధుడి కడుపులో 2,215 రాళ్లు- అవాక్కయిన డాక్టర్లు - stones operation

ఓ వృద్ధుడి కడుపులో నుంచి ఏకంగా 2 వేలకుపైగా రాళ్లను తొలగించారు వైద్యులు. ఇంత భారీ స్థాయిలో రాళ్లు బయటపడటం ప్రపంచంలోనే మూడో కేసుగా చెబుతున్నారు. ఈ సంఘటన హరియాణా కైథల్​ జిల్లాలో జరిగింది.

Stones from stamach
వృద్ధుడి పొట్టలోంచి బయటపడిన 2,215 రాళ్లు
author img

By

Published : Dec 24, 2020, 5:52 PM IST

శరీరంలో కిడ్నీ వంటి కీలక అవయవాల్లో ఒక్క రాయి ఏర్పడినా.. అల్లాడిపోతారు. సాధారణంగా అలాంటి రాళ్లు కడుపులో ఐదు, పది రాళ్లు వస్తాయి. కానీ.. హరియాణా కైథల్​ జిల్లాలో ఓ వృద్ధుడి పొట్ట.. రాళ్ల దిబ్బగా మారింది. శస్త్ర చికిత్స చేసిన వైద్యులే ఆశ్చర్యపోయేలా.. అతడి కడుపులోంచి ఏకంగా 2,215 రాళ్లు బయటపడ్డాయి. గంటల తరబడి శ్రమించి వాటిని తొలగించారు. ఇంత భారీస్థాయిలో రాళ్లు బయటపడటం రికార్డే అని చెబుతున్నారు డాక్టర్లు.

2215-stones-taken-from-stomach
వృద్ధుడి పొట్టలోంచి తొలగించిన రాళ్లు

కైథల్​ జిల్లాలోని తితరమ్​ గ్రామానికి చెందిన శ్రీచంద్​ అనే వృద్ధుడు కడుపునొప్పితో బాధపడుతూ జిల్లాలోని జైపుర్​ ఆసుపత్రిలో చేరాడు. ఈ క్రమంలో పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి వైద్యులు అతని పొట్టలో రాళ్లు ఉన్నట్లు నిర్ధరించారు. అనంతరం శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. కడుపులోంచి మొత్తం 2,215 వివిధ సైజుల్లోని రాళ్లు బయటపడినట్లు చెప్పారు. వాటిని లెక్కించేందుకు గంటన్నర సమయం పట్టినట్లు తెలిపారు.

2215-stones-taken-from-stomach
శస్త్రచికిత్స జరిగిన వృద్ధుడు శ్రీచంద్​

" ఒక వ్యక్తి శరీరం నుంచి 2వేలకుపైగా రాళ్లు బయటపడటం ప్రపంచంలోనే ఇది మూడో కేసు. తొలికేసు బంగాల్​లో వెలుగు చూసింది. అక్కడ ఏకంగా 11వేలకుపైగా రాళ్లు తీశారు. కోటాలో రెండో కేసు రాగా అక్కడ 5వేలకుపైగా రాళ్లు తొలగించారు. "

- దేవేందర్​ పవార్​, వైద్యుడు

ఇదీ చూడండి: మగువలు మెచ్చే.. వన్నెతగ్గని 'లక్కగాజులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.