ETV Bharat / bharat

ట్రాఫిక్​ ఉల్లంఘనులకు వారంలోనే రూ.21 కోట్ల జరిమానా

బెంగళూరు అర్బన్​ ట్రాఫిక్​ పోలీసులు కేవలం వారంలోనే రికార్డు స్థాయిలో రూ. 21 కోట్లకుపైగా జరిమానాల రూపంలో వసూలు చేశారు. వేర్వేరు ఉల్లంఘనల కింద.. సెప్టెంబర్​ 13-19 మధ్య ఈ మొత్తం రాబట్టారు.

21.43 crores fine Collected by Bengaluru Traffic Police
ట్రాఫిక్​ ఉల్లంఘనులకు వారంలోనే రూ. 21 కోట్ల జరిమానా
author img

By

Published : Sep 24, 2020, 3:25 PM IST

కర్ణాటకలోని బెంగళూరు ట్రాఫిక్​ విభాగం.. జరిమానాల్లో రికార్డు సృష్టించింది. ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా వారం వ్యవధిలోనే వాహనదారుల నుంచి రూ. 21 కోట్ల 43 లక్షల 80 వేలు జరిమానాల ద్వారా రాబట్టారు.

సెప్టెంబర్​ 13-19 మధ్య నమోదైన 48 వేల 141 కేసుల ద్వారా ఈ మొత్తం వసూలు చేసినట్లు స్పష్టం చేశారు ట్రాఫిక్​ పోలీసులు.

కరోనా లాక్​డౌన్​ సమయంలో సాంకేతికతను ఉపయోగించి కేసులు నమోదు చేశారు. అన్​లాక్​ తర్వాత ట్రాఫిక్​ ఉల్లంఘనులపై తీవ్రంగా దృష్టి సారించిన పోలీసులు పక్కాగా ప్రతి ఒక్క వాహనదారుడినీ తనిఖీ చేశారు.

ఈ కేసుల్లో ఎక్కువగా ప్రమాదకర డ్రైవింగ్​, సైలెన్సర్​ సమస్య, నిషేధిత స్థలంలో వాహనాల పార్కింగ్​, డ్రైవింగ్​ చేస్తూ ఫోన్​ వాడటం, సీట్​ బెల్ట్​ ధరించకపోవడం వంటివి ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.