2019 సార్వత్రికం చివరి విడత ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఓటేసేందుకు లైన్లలో వేచిఉన్నారు ఓటర్లు. ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాల్ని ప్రకటించింది ఎన్నికల సంఘం. బంగాల్లో అత్యధికంగా 32.15, అత్యల్పంగా బిహార్‌లో 18.90 శాతం ఓటింగ్ జరిగింది.
గత విడత సార్వత్రిక ఎన్నికల్లో అల్లర్లను దృష్టిలో ఉంచుకొని.. ఈసీ మరింత పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లకు ఉపక్రమించింది. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
యూపీ, బంగాల్‌లలో అక్కడక్కడా అల్లర్లు చోటుచేసుకున్నాయి.
11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాలు...
ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఎన్నికల సంఘం పోలింగ్ శాతాలను ప్రకటించింది. 11 గంటల వరకు అత్యధిక పోలింగ్ బంగాల్లో నమోదైంది.
రాష్ట్రం | పోలింగ్ శాతం |
ఝార్ఖండ్ | 30.33 |
పశ్చిమ్ బంగ | 32.15 |
మధ్యప్రదేశ్ | 28.40 |
ఉత్తర్‌ప్రదేశ్ | 21.89 |
బిహార్ | 18.90 |
పంజాబ్ | 23.36 |
ఛండీగడ్ | 22.30 |
హిమాచల్‌ప్రదేశ్ | 24.29 |
2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేటితో ముగియనుంది. మే 23న ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాల్ని వెల్లడించనున్నారు.
ఇదీ చూడండి :