ఒడిశాలోని రాయగడలో రెండు వేల కిలోల గంజాయిని ప్రత్యేక కార్య దళం (ఎస్టీఎఫ్) స్వాధీనం చేసుకుంది. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద మొత్తం అని ఎస్టీఎఫ్ తెలిపింది.
ఆకస్మిక తనిఖీ
మునిగుడా ప్రాంతలోని త్రికర్ పాడ హరిజన్ సాహి వద్ద ఉన్న రహదారిపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో మాదకద్రవ్యాలు తరలిస్తున్న లారీ పట్టుబడింది. నిందితులను గుర్తించామని, త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి : 'నాపై విష ప్రయోగానికి కారణం ఇదే!'