ETV Bharat / bharat

జూన్ 1 నుంచి సాధారణ రైళ్ల సేవలకు గ్రీన్​సిగ్నల్​ - జూన్ 1 నుంచి 200 సాధారణ రైళ్లు

railway
జూన్​ 1 నుంచి సాధారణ రైళ్లు
author img

By

Published : May 19, 2020, 10:11 PM IST

Updated : May 19, 2020, 10:34 PM IST

22:23 May 19

22:04 May 19

లాక్​డౌన్ కారణంగా రద్దయిన సాధారణ రైళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు.. వలస కార్మికుల కోసం నడుపుతున్న శ్రామిక్ రైళ్లతో పాటు సాధారణ రైళ్లకూ అనుమతిస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

వచ్చే నెల నుంచే..

జూన్​ 1 నుంచి రోజూ 200 సాధారణ రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది రైల్వేశాఖ. ప్రస్తుతానికి నాన్​ ఏసీ రైళ్లు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేసింది. రిజర్వేషన్లు చేయించుకున్న వారికి మాత్రమే రైలు ప్రయాణాలకు అనుమతి ఉంటుందని, కౌంటర్ల ద్వారా టికెట్లు తీసుకునే వెసులుబాటు లేదని తేల్చి చెప్పింది. వీటితో పాటు వలస కార్మికులను తరలించేందుకు ప్రతిరోజు 200 శ్రామిక్​ రైళ్లు నడపనున్నారు.

రైళ్లకు సంబంధించిన సమయ పట్టికను త్వరలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఏయే మార్గాల్లో రైళ్లు నడుస్తాయన్న విషయాలు వెల్లడించనప్పటికీ.. చిన్న పట్టణాలు, నగరాల్లో నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Last Updated : May 19, 2020, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.