ETV Bharat / bharat

బతుకు బండికి 'కరోనా' బ్రేకులు, 'లాక్​డౌన్'​ తిప్పలు!

లాక్‌డౌన్‌ కారణంగా మూడింట రెండోవంతు ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారని ఓ సర్వేలో తేలింది. లాక్​డౌన్​ దుష్ప్రభావాలపై పౌరసేవా సంస్థల సహాయంతో అజీమ్ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయం.. 12 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. ఈ దుష్పరిణామాల నుంచి బయట పడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

2/3rd of workers reported having lost employment following lockdown: Premji University survey
కరోనా లాక్​డౌన్​తో జీవనోపాధికి గండి
author img

By

Published : May 13, 2020, 6:34 AM IST

కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా.. మూడింట రెండో వంతు (67శాతం) మంది ఉద్యోగాలు కోల్పోయారని ఓ సర్వేలో వెల్లడైంది. 10 పౌరసేవా సంస్థల సహకారంతో అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం... 12 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. లాక్​డౌన్​ ప్రభావాన్ని అంచనా వేయడానికి 4,000 మంది కార్మికులను ఫోన్ ద్వారా ఉపాధి వంటి పలు అంశాలపై సర్వే చేసినట్లు విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పట్టణ ప్రాంతాలపై లాక్​డౌన్ అత్యధిక ప్రభావం చూపినట్లు ఈ సర్వే వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్​, బిహార్​, దిల్లీ, గుజరాత్​, ఝార్ఖండ్​, కర్ణాటక, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర (పుణె), ఒడిశా, రాజస్థాన్​, తెలంగాణ, బంగాల్ రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించారు.

సర్వేలోని ముఖ్యాంశాలు...

  • పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 మందిలో 8 మంది (80శాతం), గ్రామీణ ప్రాంతాల్లో ఆరుగురు (57శాతం) ఉపాధి కోల్పోయారు.
  • వ్యవసాయేతర రంగాల్లో స్వయం ఉపాధి కలిగినవారి పరిస్థితి ఫర్వాలేదు. అయితే వారాంతపు ఆదాయం రూ. 2,240 నుంచి రూ. 218 (90 శాతం)కి పడిపోయింది.
  • సాధారణ కూలీలకు పని లభిస్తున్నప్పటికీ వారి ఆదాయం సగానికి సగం తగ్గిపోయింది. రూ.940 నుంచి రూ.495కు పడిపోయింది.
  • 51 శాతం మందికి జీతాల్లో కోత విధించడం లేదా అసలు జీతాలే అందలేదు.
  • 49 శాతం కుటుంబాలు.. వారానికి సరిపడే నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  • కొవిడ్‌-19, దానికి సంబంధించిన భద్రతా నిబంధనల ఫలితంగా.. ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకుంది. ప్రత్యేకంగా వలస కూలీలు, అసంఘటిత రంగాల్లో పని చేసే కుటుంబాలపై అధిక ప్రభావం పడింది.
  • ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

"కరోనా దుష్ప్రభావాల నుంచి బయటపడటానికి తక్షణమే సమగ్రమై చర్యలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలి. ఈ సర్వే ఫలితాలు సహాయపడతాయని ఆశిస్తున్నాం. విధానపరమైన జోక్యం అవసరం. జీవనోపాధి పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. దీని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. లాక్​డౌన్​ విధించినప్పటి నుంచి ఉద్యోగులు రాబడుల గురించి సర్వే జరిపాం. ఈ సర్వేను ఫిబ్రవరి నెలకు ముందు పరిస్థితులతో పోల్చాం. ఇందులో స్వయం ఉపాధి. సాధారణ, నెలవారి జీతానికి లేదా రోజువారీ కూలి పని చేసుకునే వారిని సర్వే చేశాం." -సర్వే ప్రకటన.

తక్షణ చర్యలు అవసరం...

తక్షణ సహాయేేక చర్యలు ఉన్నట్లు కనిపించడంలేదని.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సర్వే సూచించింది. రాబోయే ఆరు నెలల వరకు ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరించాలని పేర్కొంది. కనీసం నెలకు రూ. 7,000 ప్రజలకు బదిలీ చేయాలని తెలిపింది. ఎంజీఎన్​ఆర్​ఈజీఏను పనులు ప్రారంభించి, దానిని విస్తరించాలని పేర్కొంది. భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించింది.

ఇదీ చూడండి: విమానం ఎక్కాలంటే ఇవి పాటించాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.