జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జిల్లాలోని అవంతిపొరా ప్రాంతంలోని సైమోలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
వారి వద్ద నుంచి భారీగా ఆయుధ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదుల వ్యక్తిగత వివరాలను సంస్థను గుర్తించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: మద్యం విక్రయాలపై ఇకనుంచి 'కొవిడ్-19' సెస్!