జమ్ము కశ్మీర్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపుర పట్టణంలో ఉగ్రవాద కదలికలున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు నిర్భంద తనిఖీలు చేపట్టారు. సైనికుల కదలికల్ని పసిగట్టిన ముష్కరులు కాల్పులకు తెగబడగా తిప్పికొట్టిన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఘటనాస్థలంలో భారీగా తుపాకులు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మరికొంత మంది ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానాలతో బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి : రావణుడికి విల్లు ఎక్కిపెట్టిన ప్రధాని మోదీ