ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో.. ధరల పెరుగుదలపై పలు రూపాల్లో ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కొంత మంది బంగారంతో పోలిక పెట్టి సెటైర్లు వేస్తుంటే.. మరికొందరు బహుమతుల రూపంలో ఉల్లిని గేలి చేస్తున్నారు.
తాజాగా బంగాల్‌కు చెందిన ఓ వివాహ శుభకార్యంలో ఉల్లి.. పెళ్లి బహుమతిగా మారింది. కిలో 150 రూపాయల చొప్పున కొనుగోలు చేసిన 2కేజీల ఉల్లిగడ్డలను ఆ యువజంటకు స్నేహితులు బహుమతిగా అందించారు. ఈ విషయం తెలియని ఆ కొత్త జంట గిప్ట్ తెరవగానే.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. పెళ్లివాకిట్లో నవ్వులు విరబూశాయి.
ఇదీ చూడండి: పేదలకు అందనంత ఎత్తుకు 'న్యాయ వ్యవస్థ' : రాష్ట్రపతి