జమ్ముకశ్మీర్‌లో ముష్కరుల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. వరుస దాడులతో గందరగోళం సృష్టిస్తున్న తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్‌లోని కేపీ రోడ్లో గస్తీ విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బృందంపై మెరుపుదాడికి పాల్పడ్డారు. అత్యాధునిక రైఫిళ్లు, గ్రనేడ్లతో ఉగ్రవాదులు... జవాన్లపై విరుచుకుపడ్డారు. భద్రతా సిబ్బంది దాడిని ప్రతిఘటించారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. మరి కొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో జమ్ముకు చెందిన ఎస్సైతో పాటు.. అనంత్‌నాగ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నారు. వీరిని చికిత్స కోసం శ్రీనగర్‌కు తరలించారు.
ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు.
ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి.