ETV Bharat / bharat

దిల్లీ ఎయిమ్స్​లో 195 మంది వైద్య సిబ్బందికి కరోనా - corona virus latest news

కరోనా మహమ్మారి వైద్య సిబ్బందినీ వదలట్లేదు. దిల్లీ ఎయిమ్స్​లో ఇప్పటి వరకు 195 మందికి పాజిటివ్​గా తేలింది. గత రెండు రోజుల్లోనే ఆస్పత్రిలోని 50 మంది వైద్య, సహాయ సిబ్బంది వైరస్​ బారిన పడ్డారు.

195 healthcare workers at AIIMS tested positive for COVID-19
దిల్లీ ఎయిమ్స్​లో 195 మంది వైద్య సిబ్బందికి కరోనా
author img

By

Published : May 28, 2020, 2:44 PM IST

Updated : May 28, 2020, 9:13 PM IST

కరోనా వైరస్​పై పోరాటంలో వైద్య సిబ్బంది విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. అయితే.. ఈ మహమ్మారి వారినీ వదలట్లేదు. కొవిడ్​-19 బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దిల్లీలోని అఖిల భారత వైద్య విద్యా సంస్థ (ఎయిమ్స్​)లో ఇప్పటి వరకు 195 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలింది.

2 రోజుల్లో 50 మందికిపైగా..

గత రెండు రోజుల్లోనే 50 మందికిపైగా వైద్య సిబ్బందికి కరోనా సోకింది. అందులో ఒక ఎంబీబీఎస్​ విద్యార్థి, ముగ్గురు రెసిడెంట్​ డాక్టర్లు, 8 మంది నర్సులు, ఐదుగురు మెస్​ సిబ్బంది సహా ల్యాబ్​ సిబ్బంది, టెక్నీషియన్స్​, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించే చర్యలు చేపట్టారు అధికారులు.

" కరోనా పాజిటివ్​గా తేలిన వైద్య, సహాయ సిబ్బందిలో.. కరోనా ప్రభావిత, ప్రభావం లేని ప్రాంతాల్లోని ఆస్పత్రులకు చెందిన వారు ఉన్నారు. ఇంజినీరింగ్​, ల్యాబ్స్​, క్యాంటీన్​, ఆపరేషన్​ థియేటర్​, వార్డ్​ సిబ్బంది వంటి అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు 195 మందికి పాజిటివ్​గా తేలింది. అందులో ఇద్దరు అధ్యాపకులు, ఐదుగురు రెసిడెంట్​ డాక్టర్లు, 21 మంది నర్సులు, 8 మంది టెక్నీషియన్లు, 32 మంది పారిశుద్ధ్య కార్మికులు, 68 మంది సెక్యూరిటీ గార్డ్స్​ ఉన్నారు. అందులో కొందరు వైరస్​ నుంచి కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. "

– అధికారులు, దిల్లీ ఎయిమ్స్​

ఈ నెల 24న ఎయిమ్స్​లో పనిచేసే పారిశుద్ధ్య విభాగం సూపర్​ వైజర్​ కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. గత వారం మెస్​ సిబ్బంది ఒకరు మరణించారు.

Last Updated : May 28, 2020, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.