కొవిడ్ కారణంగా మృతిచెందిన వైద్య, ఆరోగ్య సిబ్బంది వివరాలను కేంద్రం శుక్రవారం వెల్లడించింది. లోక్సభలో ప్రశ్నకు సమాధానంగా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర వైద్యారోగ్య సహాయక మంత్రి అశ్వినీ చౌబే. ఫిబ్రవరి 2 నాటికి మొత్తం 174 డాక్టర్లు, 116 నర్సులు, 199 ఆరోగ్య సిబ్బంది మహమ్మారి కారణంగా మృతి చెందారని పేర్కొన్నారు. రాష్ట్రాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలను వివరించారు.
10 లక్షల్లో 111 మంది..
పది లక్షల్లో 111 మంది కొవిడ్ కారణంగా మృతి చెందుతున్నారని, అదే విధంగా 10 లక్షల్లో 7,719 మంది వైరస్ బారిన పడుతున్నారని చౌబే తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది సంఖ్యపై స్పందిస్తూ ఆరోగ్య శాఖ అటువంటి వివరాలు నమోదు చేయట్లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : 'మన టీకాల కోసం 22 దేశాల నుంచి అభ్యర్థనలు'