ETV Bharat / bharat

16 ఏళ్ల బాలికపై నెలరోజులుగా సామూహిక అత్యాచారం - pocso case latest

దేశమంతటా అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. కామాంధుల కర్కశత్వానికి ఆడపిల్లలు బలవుతూనే ఉన్నారు. మేకలు కాస్తున్న ఓ బాలికపై కామాంధులు కన్నేశారు. జీపులో తీసుకువెళ్లి, దాదాపు నెలరోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పాడ్డారు. రాజస్థాన్​లో ఈ ఘటన వెలుగు చూసింది.

16 yr old abducted, repeatedly gang raped for weeks in Churu
16 ఏళ్ల బాలికపై నెలరోజులుగా సామూహిక అత్యాచారం
author img

By

Published : Oct 8, 2020, 11:04 AM IST

హాథ్రస్​ ఘటనతో దేశమంతా ఆగ్రహ జ్వాలలతో నిండిపోగా.. కొత్త దారుణాలు బయటపడుతున్నాయి. రాజస్థాన్​ చురూ జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. దాదాపు నెలరోజులుగా కామాంధుల క్రూరత్వానికి ఓ 16 ఏళ్ల బాలిక బలైంది. సామూహిక అత్యాచారానికి గురైంది.

అసలేం జరిగింది?

సెప్టెంబర్​ 6న మేకలను కాస్తున్న బాలికను నిందితుడు.. తనను జీపులో వచ్చి అపహరించాడు. జిల్లాలోని మరో చోటుకు తీసుకువెళ్లి 20 నుంచి 25 రోజులుగా... సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి, ఇంటికి చేరుకుంది. తర్వాత మహిళా పోలీస్​ స్టేషన్​లో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

మత్తుపదార్థాన్ని కలిపి..

బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టేముందు.. తేనీటిలో మత్తుపదార్థాన్ని నిందితులు కలిపి తాగించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురు నిందితులపై భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), పోక్సో చట్టం కింద.. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:హాథ్రస్‌ ఘటనలో షాకింగ్‌ మలుపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.