ETV Bharat / bharat

కరోనా నివారణకు కేంద్రం 15 సూచనలు

దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ముమ్మర చర్యలకు ఉపక్రమించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు పలు సూచనలు చేసింది. 15 అంశాలతో కూడిన పట్టికను తాజాగా విడుదల చేసింది.

coronavirus
కరోనా
author img

By

Published : Mar 16, 2020, 10:05 PM IST

కరోనా విస్తృతిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని కేంద్రం పేర్కొంది. 15 అంశాలతో కూడిన సూచనల పట్టిక విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సూచనలన్నీ.. ఈనెల 31 వరకు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. అన్ని సూచనలను ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత సూచనలు:-

  1. అన్ని విద్యా సంస్థలు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు సహా... జిమ్‌లు, మ్యూజియంలు, సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రాలు, ఈత కొలనులు, థియేటర్లను మూసివేయాలి. విద్యార్థులు ఇంట్లోనే ఉండాలి... ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించాలని సూచన.
  2. పరీక్షలను వాయిదా వేసే అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలి. విద్యార్థులలో ఒక మీటర్ భౌతిక దూరాన్ని నిర్ధరించిన తర్వాతే పరీక్షలు కొనసాగించాలి.
  3. ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునేలా(వర్క్‌ ఫ్రం హోం) ప్రోత్సహించాలని సూచన.
  4. సాధ్యమైనంత వరకు సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా జరపాలి. అవసరమైతే తప్ప.. పెద్ద సంఖ్యలో వ్యక్తులతో కూడిన అన్ని సమావేశాలన్నింటినీ రద్దు చేయడం లేదా వాయిదా వేయాలి.
  5. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. తరుచుగా వాడే ప్రదేశాల ఉపరితలాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చూడాలి. ముఖ్యంగా రెస్టారెంట్లు, పబ్లిక్‌ స్థలాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిచోటా.. కనీసం ఒక మీటరు దూరంలో కూర్చునేలా చూడాలి. ఓపెన్ ఎయిర్ సీటింగ్‌ను ప్రోత్సహించాలి.
  6. ఇప్పటికే నిర్ణయించిన వివాహాలకు హాజరయ్యే అతిథులను పరిమిత సంఖ్యకు కుందించుకోవాలి. అనవసరమైన అన్ని కార్యక్రమాలను వాయిదా వేయాలి.
  7. పెద్ద సంఖ్యలో హజరయ్యే క్రీడా కార్యక్రమాలు మరియు పోటీల నిర్వాహకులతో స్థానిక అధికారులు చర్చించి ఆయా కారక్రమాలను రద్దు చేయించాలి.
  8. సామూహిక సమావేశాలను క్రమబద్ధీకరించడానికి అధికారులు స్థానిక నాయకులు, మత పెద్దలతో చర్చించి అవకాశం ఉన్న మేరకు రద్దు అయ్యేలా చూడాలి. లేని పక్షంలో ప్రతి ఇద్దరి మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండేలా జాగ్రత్తలు చేపట్టాలి.
  9. మార్కెట్లలో కమ్యూనికేషన్ డ్రైవ్ చేపట్టడానికి స్థానిక అధికారులు, వర్తక సంఘాలు, ఇతర వాటాదారులతో సమావేశం కావాలి. కూరగాయలు, నిత్యావసర వస్తువుల మార్కెట్లు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు, పోస్ట్ ఆఫీస్ మొదలైన ప్రదేశాల్లో అవసరమైన సేవలు అందించాలి.
  10. అన్ని వాణిజ్య కార్యకలాపాల్లో వినియోగదారుల మధ్య ఒక మీటర్ దూరం ఉండాలి. మార్కెట్లలో పీక్ అవర్ రద్దీని తగ్గించే చర్యలు చేపట్టాలి.
  11. అనవసరమైన ప్రయాణానికి దూరంగా ఉండాలి. బస్సులు, రైళ్లు మరియు విమానాలు ప్రజా రవాణాలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
  12. కోవిడ్‌19 నిర్వహణకు సంబంధించి ఆస్పత్రులు సూచించిన ప్రోటోకాల్‌ను పాటించాలి. ఆసుపత్రుల్లో రోగులను సందర్శించే కుటుంబసభ్యులు, స్నేహితులు, పిల్లలను పరిమితం చేయాలి.
  13. పరిశుభ్రత మరియు శారీరక దూరాన్ని కొనసాగించాలి. శుభాకాంక్షలు తెలుపుకునే విషయంలో చేతులు కలుపుకోవడం, కౌగిలించుకోవడం వంటి వాటిని నివారించాలి.
  14. ఆన్‌లైన్ ఆర్డరింగ్ సేవల్లో పనిచేసే డెలివరీ పురుషులు, మహిళలకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలి.
  15. సంఘాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. అందరికి సమాచారం అందించేలా చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.