ETV Bharat / bharat

'మహా' విలయం: కొత్తగా 20 వేల మందికి కరోనా

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో తాజాగా 20 వేలమందికి పైగా కరోనా బారినపడగా.. కర్ణాటకలో 9 వేలు, తమిళనాడులో 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

15 deaths, 2,891 fresh virus cases in Assam
కర్ణాటకలో మరో 9,746 మందికి కరోనా
author img

By

Published : Sep 5, 2020, 7:41 PM IST

Updated : Sep 5, 2020, 9:28 PM IST

దేశంలో కరోనాకు అడ్డుకట్ట పడటం లేదు. మహారాష్ట్రలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో 20,489 మందికి వైరస్​ సోకింది. మరో 312 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 8 లక్షల 83వేలు దాటగా... 26,276 మంది మరణించారు.

కర్ణాటకలో కొత్తగా 9 వేల 746 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 128 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మృతుల సంఖ్య 6,170కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం 99,617 మంది చికిత్స పొందుతుండగా.. 2 లక్షల 83 వేల మంది కోలుకున్నారు.

తమిళనాడులో తాజాగా 5,870 మంది కరోనా బారినపడ్డారు. 5,859 మంది రికవరీ అయ్యారు. మరో 61 మంది చనిపోయారు. ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మందికి వైరస్​ నయమైంది. మరో 51,583 మంది చికిత్స పొందుతున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,692 మంది వైరస్​ బారినపడ్డారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 59 వేలు దాటింది.

  • ఒడిశాలో కొత్తగా 3,543 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 1,20,221కి చేరింది. మొత్తం 538 మంది మహమ్మారికి బలయ్యారు. 29,229 యాక్టివ్​ కేసులు ఉండగా.. 90 వేల మంది కోలుకున్నారు.
  • దిల్లీలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 2,973 కరోనా కేసులు వెలుగుచూశాయి. గడచిన 71 రోజుల్లో ఇవే అత్యధిక కేసులని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. వీరితో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1.88 లక్షలకు చేరింది. ఫలితంగా 4,538 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అసోంలో తాజాగా 2,891 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కాగా... మొత్తం బాధితుల సంఖ్య 1,21,224కు చేరింది.
  • జమ్ముకశ్మీర్​లో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,251 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. వీటిలో 739 జమ్ము నుంచి కాగా, 512 కశ్మీర్​లో వెలుగుచూశాయి. ఇప్పటి వరకు మొత్తం 770 మంది మృతి చెందారు.
  • రాజస్థాన్​లో మరో 718 మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా ఎనిమిది మంది మృతి చెందారు.
  • శుక్రవారం ఉదయం 8 నుంచి ఇవాళ ఉదయం వరకు దేశవ్యాప్తంగా వచ్చిన కేసులలో 46 శాతం కేసులు, 52 శాతం మరణాలు.. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటకలో కలిపి నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ 3 రాష్ట్రాలు కరోనా కట్టడిపై మరింతగా దృష్టిపెట్టాలని కేంద్రం సూచించింది.

రికవరీలో పెరుగుదల

గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 70,072 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 31 లక్షలు దాటగా.. రికవరీ రేటు 77.23కు చేరింది. మరణాల రేటు 1.73 శాతంగా ఉంది. శుక్రవారం 10,59,346 నమూనాలను పరీక్షించారు. దేశవ్యాప్తంగా మొత్తం 4,77,38,491 టెస్టులు చేశారు.

Last Updated : Sep 5, 2020, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.