జులై నెలలో 14 లక్షల 24 వేల ఉద్యోగాల కల్పన జరిగినట్లు ఉద్యోగుల బీమా సంస్థ-ఈఎస్ఐసీ విడుదల చేసిన పేరోల్ డేటాలో వెల్లడైంది. జూన్‌లో 12 లక్షల 49వేల మంది ఉద్యోగాలు పొందగా ఈ సంఖ్య జులైలో అధికంగా ఉన్నట్లు డేటా తెలిపింది. 2018-19లో కోటీ 49 లక్షల మంది కొత్తగా ఈఎస్ఐసీ సబ్‌స్క్రిప్షన్ కోసం నమోదు చేసుకున్నట్లు.... జాతీయ గణాంకాల కార్యాలయం ఎన్‌ఎస్‌ఓ నివేదికలో తెలిపింది.
ఈఎస్ఐసీతో పాటు, భవిష్య నిధి సంస్థ-ఈపీఎఫ్ఓ, పింఛను నిధుల నియంత్రణ, అభివృద్ధి సంస్థ-పీఎఫ్డీఆర్ఏ నడిపే వివిధ భద్రత పథకాలలో కొత్తగా చేరేవారి పేరోల్ డేటా ఆధారంగా ఎన్‌ఎస్‌ఓ నివేదికను రూపొందిస్తారు. ఈ నివేదిక ప్రకారం..... 2017 నుంచి జులై 2019 వరకు 2 కోట్ల 83 వేల మంది ఈఎస్ఐ పథకంలో కొత్తగా చేరారు. జూన్‌లో 10 లక్షల 75వేల మంది కొత్తగా ఈపీఎఫ్ఓ కోసం నమోదు చేసుకోగా జులైలో వీరిసంఖ్య 11 లక్షల 61వేలుగా ఉంది. 2018-19లో 61 లక్షల 12 వేలమంది కొత్త సబ్‌స్క్రైబర్లు ఈపీఎఫ్ఓ నడిపే సామాజిక భద్రత పథకాలలో చేరారు.
ఇదీ చూడండి : ఓ చైనీస్ కుటుంబ కథ: ఫ్రీ ఫ్లాట్ కోసం 23 సార్లు పెళ్లిళ్లు