ETV Bharat / bharat

కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ తండ్రి అరెస్ట్!

కేరళలో 13 ఏళ్ల బాలికపై ఏడాది పాటు అత్యాచారానికి పాల్పడ్డ ఆమె మూడో తండ్రి అరెస్ట్ అయ్యాడు. ఒంటరిగా ఉన్న ఆ బాలికను శారీరకంగా వేధించిన మరో కీచకుడి జాడ కోసం గాలిస్తున్నారు పోలీసులు.

13-year-old-girl-raped-by-third-father-in-idukki
కూతురిపై అత్యాచారానికిపాల్పడ్డ తండ్రి అరెస్ట్!
author img

By

Published : Sep 15, 2020, 9:01 AM IST

కేరళ ఇడుక్కిలో 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ తండ్రిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో కామాంధుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇడుక్కి జిల్లా శాంతపరా పరిధిలోని రాజకుమారి ఖాజనప్పరాకు చెందిన 13 ఏళ్ల బాలిక, శారీరకంగా చిత్రహింసలకు గురైంది. వేదన తాళలేక గాయాలతో ఓ ఆసుపత్రిలో చేరింది. తన మూడోతండ్రి ఏడాదిపాటుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని. ఖాజనప్పరాకు చెందిన నాగరాజన్(45) అనే మరో వ్యక్తి లైంగికంగా వేధించాడని వైద్యులతో చెప్పుకుంది. ఆసుపత్రి నిర్వాహకుల సమాచారం మేరకు, శాంతనపరా పోలీసులు రంగంలోకి దిగారు.

తమిళనాడుకు చెందిన బాలిక మూడో తండ్రిని అరెస్ట్ చేసి, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 354A, పోక్సో చట్టంలోని 27, 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నాగరాజన్​పై పోస్కో చట్టం 376వ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అతడి జాడకోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: వ్యవసాయ బిల్లులపై రైతులకు కేంద్రం భరోసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.