కర్ణాటక కొప్పాల్లో ఓ అరుదైన ఘటన జరిగింది. కేవలం మూడున్నర అడుగులు(121 సెంటిమీటర్ల) పొడవున్న ఓ మరుగుజ్జు మహిళ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
బాసుపురకు చెందిన నేత్రావతి అనే మహిళ సుమారు మూడున్నర అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. జన్యు లోపాల వల్ల శారీరకంగా ఎదగలేకపోయింది. అయితే ఇటీవలే వివాహం చేసుకున్న నేత్రావతి గర్భం దాల్చింది. నెలలు నిండి పురిటి నొప్పులతో బాధపడుతూ.. ఆస్పత్రికి వెళితే డెలివరీ చేయలేమని వైద్యులు చేతులెత్తేశారు. సరైన ఎత్తు లేకపోవటం వల్ల తల్లీబిడ్డకు ప్రమాదం అని తేల్చేశారు. నగరంలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు తిరిగింది నేత్రావతి. కానీ, ఎవరూ ఆమెకు వైద్యం అందించలేదు.
చివరకు.. గంగావతిలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నేత్రావతికి భరోసా ఇచ్చారు. ఆమె సమస్యను సవాలుగా స్వీకరించారు. శస్త్ర చికిత్స చేసి మరుగుజ్జు మహిళకు అమ్మతనాన్ని అందించారు.
ప్రస్తుతం మాతా-శిశువులు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు వైద్యులు.
ఇదీ చదవండి:నితిన్ గడ్కరీ బౌలింగ్లో.. హార్దిక్ పాండ్య సిక్సర్