దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు ఈ వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో 24 కేసులు నమోదయ్యాయి.
కేరళలో 12
కేరళలో మరో 12 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఎర్నాకులంలోని నిర్బంధ కేంద్రంలో వైద్యం పొందుతున్న ఐదుగురు విదేశీయులు, కసార్గాడ్లో ఆరుగురు, పాలక్కడ్‌కు చెందిన ఒకరు వైరస్ బారిన పడినట్లు గుర్తించారు. 55 ఏళ్లకు పైబడిన వారిని కొచిలోని కలమస్సేరి వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 37కు చేరింది.
రాజస్థాన్‌లో 6
రాజస్థాన్‌లో మరో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. భిల్వారా జిల్లాలోని నిర్బంధ కేంద్రాల్లో ఉన్న 28 మందిలో ఆరుగురికి పాజిటివ్ రాగా.. మరో 11 మందికి నెగిటివ్‌గా తేలినట్లు జిల్లా పాలనాధికారి రాజేంద్ర భట్ తెలిపారు.
చండీగఢ్‌లో 4
చండీగఢ్‌లో కరోనా విస్తరిస్తోంది. కొత్తగా మరో 4 కేసులు పాజిటివ్‌గా తేలాయి.
ఇదీ చూడండి: సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. కరోనాపై చర్చ