పెళ్లి వేడుకలో పాల్గొని సంతోషంగా ఇంటికి పయనమైన ఓ కుటుంబానికి డంపర్ వాహనం రూపంలో మృత్యువు కాటేసింది. మహారాష్ట్ర జలగావ్ జిల్లాలో నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 12మంది దుర్మరణం చెందారు. వీరంతా చోప్రా గ్రామంలో జరిగిన బంధువుల వివాహ వేడుకలో పాల్గొని తిరిగి స్వగ్రామం చించోల్ చేరుకుంటుండగా ఘటన జరిగింది. ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మరణించారు. ఎస్యూవీ వాహనం నుజ్జునుజ్జయింది.
ఆదివారం రాత్రి 11 గంటలకు ఎదురుగా వస్తున్న డంపింగ్ వాహనం ఎస్యూవీని ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బాధితులంతా ముక్తాయ్ తహసీల్దార్ ప్రాంతంలోని చించోల్, మెహుల్ గ్రామాలకు చెందినవారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: దిల్లీ దంగల్: 'ఓటు బ్యాంకు నేతలకు, దేశభక్తులకు మధ్య పోరు'