ETV Bharat / bharat

స్వదేశానికి క్రూయిజ్​ షిప్​లోని భారతీయులు

జపాన్​ డైమండ్​ ప్రిన్సెస్ నౌకలో నిర్బంధంలో ​ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చింది ఎయిర్​ ఇండియా ప్రత్యేక విమానం. 119 భారతీయులు సహా 124 మంది ఇవాళ ఉదయం దిల్లీ చేరుకున్నారు. తరలింపునకు ఏర్పాట్లు చేసిన జపాన్​ అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు విదేశాంగ మంత్రి జయ్​శంకర్​.

author img

By

Published : Feb 27, 2020, 7:05 AM IST

Updated : Mar 2, 2020, 5:16 PM IST

119 Indians, 5 foreigners from coronavirus-hit cruise ship land in Delhi on AI flight
స్వదేశానికి క్రూయిజ్​ షిప్​లోని భారతీయులు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిరోజులుగా జపాన్​ నిర్బంధంలో ఉన్న క్రూయిజ్​ షిప్​లోని భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఎయిర్​ ఇండియా ప్రత్యేక విమానం ద్వారా.. ఇవాళ ఉదయం దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. 119 మంది భారతీయులతో పాటు శ్రీలంక, నేపాల్​, సౌతాఫ్రికా, పెరూలకు చెందిన మరో ఐదుగురిని తీసుకొచ్చిందీ విమానం.

తరలింపునకు ఏర్పాట్లు చేసిన జపాన్​ అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు విదేశాంగ మంత్రి జయ్​శంకర్​.

''టోక్యో నుంచి వచ్చిన ఎయిర్​ ఇండియా విమానం దిల్లీలో ఇప్పుడే ల్యాండయింది. కొవిడ్​-19 వైరస్​ వ్యాప్తితో జపాన్​ డైమండ్​ ప్రిన్సెస్​ నౌక నిర్బంధంలో ఉన్న 119 మంది భారతీయులు సహా శ్రీలంక, నేపాల్​, సౌతాఫ్రికా, పెరూలకు చెందిన ఐదుగురు పౌరులను భారత్​కు చేర్చిన జపాన్​ అధికారులకు కృతజ్ఞతలు.''

-జయ్​శంకర్​, భారత విదేశాంగ మంత్రి.

హాంకాంగ్​లో దిగిన ఓ ప్రయాణికుడికి వైరస్​ లక్షణాలు కనిపించినందున మొత్తం 3 వేల 711 మందితో కూడిన ఈ క్రూయిజ్​ షిప్​ను ఫిబ్రవరి 5న జపాన్​ తీరంలో నిలిపివేశారు. అప్పటి నుంచి నౌకను నిర్బంధంలోనే ఉంచారు. నౌకలో మొత్తం 138 మంది భారతీయులు(132 సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు) ఉండగా వారిలో 16 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం వారికి జపాన్​లోనే వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.

చైనాలో పుట్టిన కరోనా వైరస్ 37 దేశాలకు విస్తరించింది. 80 వేలకు పైగా ప్రజలకు సోకగా.. 2600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Mar 2, 2020, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.