దేశంలోనే కాకుండా విదేశాల్లోని భారతీయులనూ వదలడం లేదు కరోనా మహమ్మారి. ఇప్పటివరకూ మొత్తం 11,600 మంది ప్రవాస భారతీయులు కొవిడ్ బారిన పడ్డారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజ్యసభకు తెలిపింది.
ఎగువసభలో లేవనెత్తిన ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు విదేశాంగ మంత్రి మురళీధరన్. అయితే విదేశాల్లో ఉన్న భారత పౌరుల సంక్షేమం కోసం.. అక్కడ ప్రత్యేక మిషన్లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
2020 సెప్టెంబర్ 10నాటికి భారత మిషన్ వివరాల ప్రకారం.. మొత్తం 11,616 ప్రవాసులకు వైరస్ సోకింది. వీరిలో సింగపుర్‌లో 4,618, బహ్రెయిన్‌లో 2,639, కువైట్‌లో 1,769, ఒమన్‌లో 907, ఖతార్‌లో 420, ఇరాన్లో 308, యూఏఈలో 238, ఇటలీలో 192 మంది ఉన్నారు.
ఇదీ చదవండి: 'చైనా తీరు మార్చుకుంటేనే సరిహద్దులో శాంతి'