ETV Bharat / bharat

కరోనాను జయించిన 106ఏళ్ల వృద్ధుడు

author img

By

Published : May 7, 2020, 9:15 AM IST

కరోనా మహమ్మారిని జయించిన పెద్ద వయస్కుడిగా నిలిచారు దిల్లీకి చెందిన 106ఏళ్ల వృద్ధుడు. 17 రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు.

106 year-old Delhi man defeats corona
కరోనాను జయించిన 106ఏళ్ల యోధుడు

దిల్లీలోని నవాబ్​గంజ్​ ప్రాంతానికి చెందిన 106ఏళ్ల ముక్తార్​ అహ్మద్​.. కరోనా వైరస్ బారిన పడి 17 రోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ఏప్రిల్​ 14న కరోనా లక్షణాలతో రాజీవ్ గాంధీ సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​లో అడ్మిట్ అయ్యారు. చికిత్స అనంతరం వైద్య పరీక్షలు నిర్వహంచగా రెండు సార్లు నెగిటివ్ వచ్చింది. మే 1న అతన్ని ఇంటికి పంపారు వైద్యులు.

మొదట ముక్తార్​ కుమారునికి వైరస్ సోకగా, ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ మహమ్మారి బారిన పడ్డారు.

"మొదట మా నాన్నకు పాజిటివ్​గా తేలింది. ఆ తర్వాత మా అమ్మ, సోదరుడు, తాతలకు వైరస్​ సోకింది. అందరం కోలుకున్నాం. ప్రస్తుతం మా నాన్న ఒక్కరే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరలో ఆయన కూడా కోలుకుంటారని ఆశిస్తున్నాం."

-ముక్తార్​ మనవడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.