మహారాష్ట్రలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 10,576 కొత్త కేసులు రాష్ట్రంలో వెలుగుచూశాయి. ఇప్పటివరకు ఒక్కరోజు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,607కు చేరింది.
మరో 280 మంది కొవిడ్‌తో మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 12,556కు పెరిగింది. ఇప్పటివరకు 1,87,769మంది కరోనా నుంచి కోలుకున్నారు.
బంగాల్లో వైరస్ విలయం
పశ్చిమ బంగాలోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. ఒక్కరోజే 2,291 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 49,321కు పెరిగింది. మరో 39 మంది వైరస్‌కు బలయ్యారు. ఇప్పటివరకు 1,221మంది కొవిడ్‌తో మరణించారు.
రాజధానిలో కరోనా కేసులు ఇలా..
దిల్లీలో కొత్తగా 1,227 మందికి కరోనా సోకింది. మరో 29 మరణించారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 1,26,323కు చేరింది. ఇప్పటివరకు 3,719 మంది వైరస్‌తో మృతి చెందారు. 1,07,650 మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు.