ETV Bharat / bharat

కరోనా కేసుల్లో 1000 మార్కు దాటిన మహారాష్ట్ర

భారత్​లో కరోనాకు కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఆ రాష్ట్రంలో 1000కిపైగా కేసులు నమోదయ్యాయి. ముంబయిలో ఈ ఒక్కరోజే 100కుపైగా కేసులు వెలుగుచూశాయి.

100 new #COVID19 cases and 5 deaths have been reported in Mumbai today.
ఒక్క ముంబయిలోనే ఇవాళ 100 కరోనా కేసులు
author img

By

Published : Apr 7, 2020, 7:51 PM IST

మహారాష్ట్రపై కొవిడ్​-19 వైరస్ విరుచుకుపడుతోంది. ఇక్కడ కరోనా కేసుల సంఖ్య 1018కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 48 మంది మరణించారు.

సగం కంటే ఎక్కువ బాధితులు ముంబయిలోనే ఉన్నారు. ఈ రాజధాని నగరంలో ఇవాళ ఒక్కరోజే 100కుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు. ముంబయిలో మృతుల సంఖ్య 40కి చేరింది. ఈ నగరంలో బాధితుల సంఖ్య 590గా ఉంది.

24 గంటల్లోనే 500 +..

భారత్​లో కరోనా కేసులు 5 వేలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 4 వేల 789 మందికి వైరస్​ సోకినట్లు స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. మరణాల సంఖ్య 124కు చేరింది. మొత్తం 352 మంది కోలుకోగా ప్రస్తుతం యాక్టివ్​ కేసుల సంఖ్య 4,312గా ఉంది.

గడిచిన 24 గంటల్లో 508 కొవిడ్​ కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి.

తమిళనాడు 621, దిల్లీ 576 మంది బాధితులతో కేసుల పరంగా మహారాష్ట్ర తర్వాత వరుసగా 2,3 స్థానాల్లో ఉన్నాయి.

100 new #COVID19 cases and 5 deaths have been reported in Mumbai today.
దేశంలో 124కు చేరిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.