కొన్ని నెలలుగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోకి దాదాపు 100 మంది నక్సల్స్ చొరబడినట్లు పోలీసులు తెలిపారు. వారి ప్రాబల్యాన్ని విస్తరించుకోవడానికే తరలివచ్చారని పేర్కొన్నారు. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన బాలాఘాట్, మండ్లాకు 6 పారామిలిటరీ దళాలను పంపించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
"మాకు అందిన సమాచారం ప్రకారం తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కొన్ని నెలలుగా దాదాపు 100మంది నక్సలైట్లు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి మధ్యప్రదేశ్‌కు వచ్చారు . బాలాఘాట్, మండ్లా జిల్లాల్లో 6 నక్సలైట్ దళాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అందులో కతియా మోచా దళం మండ్లాకు గతేడాదే వచ్చింది."
-ఓ పోలీసు అధికారి
నక్సలైట్ల ఏరివేతకు ఆరు పారామిలిటరీ బలగాలను మండ్లా, బాలాఘాట్ ప్రాంతాలకు పంపనున్నట్లు గత నెలలో బాలాఘాట్ పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
మధ్యప్రదేశ్‌కు పోలీసు విభాగానికి సంబంధించిన నక్సల్స్ వ్యతిరేక బలగాలు ఇప్పటికే బాలాఘాట్‌లో ఉన్నాయని అధికారులు అన్నారు.
ఇదీ చూడండి: మూడేళ్లలో 216 మంది నక్సల్స్ ఎన్కౌంటర్