ETV Bharat / bharat

10 మంది నవజాత శిశువులు మృతి-ప్రముఖుల దిగ్భ్రాంతి - చిన్నారుల మృతి

మహారాష్ట్రలో పెను విషాదం జరిగింది. అర్ధరాత్రి తర్వాత భండారా జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూలో మంటలు చెలరేగి10 మంది నవజాత శిశువులు చనిపోయారు. మరో ఏడుగురుని సిబ్బంది రక్షించారు. ఘటనపై ముఖ్యమంత్రి ఉద్ధవ్​ఠాక్రే దర్యాప్తునకు ఆదేశించారు. శిశువుల మరణం పట్ల రాష్ట్రపతి రామ్​నాథ్​కోవింద్​, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

10-newborn-infants-died-in-governtment-hospital-bhandara-district-hospital
10 మంది నవజాత శిశువులు మృతి-ప్రముఖల దిగ్భ్రాంతి
author img

By

Published : Jan 9, 2021, 1:18 PM IST

Updated : Jan 9, 2021, 3:50 PM IST

మహారాష్ట్ర భండారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఐసీయూ విభాగంలో శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగటమే కారణంగా తెలుస్తోంది. ఘటన జరగిన సమయంలో మొత్తం 17 మంది చిన్నారులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

అర్ధరాత్రి సమయంలో ఐసీయూ గది నుంచి దట్టమైన పొగ బయటకి రావటాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది తలుపులు తెరిచారు. అప్పటికే గది మొత్తం పొగతో నిండిపోయింది. వెంటనే ఆసుపత్రి యాజమాన్యానికి, అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఎస్​ఎన్​ఐసీలో అవుట్​ బార్న్​, ఇన్​బార్న్​ అని రెండు విభాగాలు ఉండగా.. అవుట్​బార్న్​లో ఉన్న 10 మంది చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన చిన్నారుల్లో ముగ్గురు సజీవ దహనం కాగా.. మరో ఏడుగుగురు పొగ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరో ఏడుగురు చిన్నారులను రక్షించి మరో ఆసుపత్రికి తరలించారు. ఇతర రోగులను సైతం సురక్షిత ప్రాంతానికి తరలించారు.

10 మంది నవజాత శిశువులు మృతి-ప్రముఖల దిగ్భ్రాంతి

మోదీ దిగ్భ్రాంతి

మహారాష్ట్రలో 10మంది నవజాత శిశువుల మరణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిశువుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్​ చేశారు. శిశువులు మరణించడం ఎంతో దురదృష్టకరమని కేంద్రమంత్రి అమిత్​ షా అన్నారు. ఈ వార్త తనను ఎంతో బాధించిందని తెలిపారు.

బాధితులను ఆదుకోవాలి..

మహారాష్ట్రలో నవజాత శిశువులు చనిపోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిచాలని కోరారు.

ముఖ్యమంత్రి ఆరా... విచారణకు ఆదేశం

ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఆరా తీశారు. మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్‌తోపేతో పాటు భండారా జిల్లా ఎస్పీతోనూ ఠాక్రే చర్చించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు మృతుల కుటుంబసభ్యులకు రూ. 5లక్షల పరిహారం ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం.

బాధ్యులను శిక్షించాలి

మహారాష్ట్ర భండారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించి 10మంది నవజాత శిశువులు మరణించిన ఘటనపై విచారణ వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​. దీనిపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: ఆసుపత్రిలో కరోనా బాధితుడికి పుట్టినరోజు వేడుకలు

Last Updated : Jan 9, 2021, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.