తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని ఆనందపురంలో ఉన్న కల్వరీ ఛాపెల్ ట్రస్ట్.. హెచ్ఐవీ బాధితులకు అండగా నిలుస్తోంది. వారిని చేరదీసి మంచి విద్య అందిస్తోంది. వారిలో చాలా మంది ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయితే ఇటీవలే మరో అడుగు ముందుకేసింది ట్రస్ట్. హెచ్ఐవీ పాజిటివ్ ప్రేమికులకు ఓ వేడుక నిర్వహించి పెళ్లి చేసింది.
తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి సమక్షంలో 10 హెచ్ఐవీ పాజిటివ్ జంటలు ఒక్కటయ్యాయి. ఇలాంటి వేడుక నిర్వహించడం చాలా గొప్ప విషయమని ప్రశంసించారు సందీప్. ట్రస్ట్ సభ్యులను అభినందించారు.
అనంతరం హెచ్ఐవీ బాధితులకు అండగా నిలిచిన వారికి అవార్డులు అందించింది ట్రస్ట్.
ఇదీ చూడండి- ఔరా: అగ్గిపుల్లలతో అందమైన తాజ్మహల్