జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద పాక్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. పూంచ్ జిల్లాలోని దిగ్వార్ సెక్టార్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఘటనలో ఓ భారత జవాను వీరమరణం పొందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
మోర్టార్ షెల్స్, చిన్న ఆయుధాలతో మధ్యాహ్నం 3.45 గంటలకు పాక్ సైన్యం కాల్పులు జరిపిందని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ చర్యను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలే లక్ష్యంగా పాక్ ఈ కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: కేరళ వరద బాధితులకు కొత్త వెలుగు- రేపు 121 ఇళ్ల పంపిణీ