ETV Bharat / bharat

పదేళ్లలో 5రెట్లు పెరిగిన రైల్వే చోరీలు - రైల్వే రక్షణ దళం

గత పదేళ్లలో రైళ్లలో జరిగిన చోరీలపై ప్రయాణికుల నుంచి లక్షా 71వేల ఫిర్యాదులు అందాయని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. 2009తో పోలిస్తే 2018లో దొంగతనాలు 5 రెట్లు పెరిగాయని వెల్లడించింది.

పదేళ్లలో 5 రెట్లు పెరిగిన రైల్వే దొంగతనాలు
author img

By

Published : Apr 28, 2019, 3:16 PM IST

రైళ్లలో జరుగుతున్న దొంగతనాలపై గత పదేళ్లలో లక్షా 71వేల ఫిర్యాదులు నమోదయ్యాయని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. భారతీయ రైల్వేల్లో భద్రత ఎంత తీసికట్టుగా ఉందో ఈ విషయం స్పష్టం చేస్తోంది.

2009 నుంచి 2018 మధ్య ప్రయాణికులు.. 1.71లక్షల ఫిర్యాదులను రైల్వే శాఖకు చేశారు. 2018లోనే అత్యధికంగా 36వేల 584 కేసులు నమోదవ్వడం గమనార్హం. మరోవైపు గత నాలుగేళ్లలో రైళ్లలో బలవంతంగా డబ్బు వసూలు చేస్తోన్న 73వేల 837 మంది ట్రాన్స్​జెండర్లను అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.

ఐదు రెట్లు పెరిగాయి...

2009తో పోల్చుకుంటే 2018 నాటికి రైల్వేల్లో దొంగతనాలు ఐదు రెట్లు పెరిగినట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వేశాఖ ఈ గణాంకాలను వెల్లడించింది.

రాష్ట్రాలదే బాధ్యత...

"రైళ్లలో శాంతి, భద్రతలు కాపాడడం రాష్ట్రాల బాధ్యత. రైల్వే ప్రాంగణాల్లో, పయనిస్తున్న రైళ్లలో నేరాల నివారణ, కేసుల నమోదు, దర్యాప్తు, విచారణ, చట్టం అమలు, నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వ రైల్వే పోలీసులు ఈ బాధ్యతలను చూసుకుంటారు."- రైల్వే మంత్రిత్వశాఖ

రోజుకు 2,500 రైళ్లలో భద్రతను రైల్వే రక్షణ దళం చూస్తుండగా 2,200 రైళ్లలో భద్రతను రైల్వే పోలీసులు పర్వవేక్షిస్తున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ వివరించింది.

న్యాయపరిధికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. రైల్వేమంత్రిత్వ శాఖకు కొన్ని సూచనలు చేశారు. ఆన్​లైన్​లో ఎఫ్​ఐఆర్ నమోదు చేసుకునే సదుపాయం కల్పించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: 'ప్రజలను ఆదరించేవారే అసలైన జాతీయవాదులు'

New Delhi, Apr 27 (ANI): As the BJP fielded actor Sunny Deol from the Gurdaspur Lok Sabha seat which earlier belonged to late actor and party leader Vinod Khanna, the latter's wife Kavita Khanna has expressed disappointment over the ticket snub but said she will not contest as an independent candidate from the seat. Kavita added that she is making a "personal sacrifice" for the larger good of the party and nation which is to assure the return of Prime Minister Narendra Modi after the Lok Sabha elections. Asked whether she would campaign for Deol, Kavita said she has been asked by the actor for it but won't refuse if contacted.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.