ETV Bharat / bharat

శ్మశానంలో కూలిన పైకప్పు- 23 మంది మృతి - Ghaziabad Lanter Wall fell

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలకు హాజరైన సమయంలో శ్మశానవాటిక ప్రాంగణ పైకప్పు కూలి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 2లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.

05 people died after wall collapsed at crematorium ghat premises in Ghaziabad
శ్మశానవాటికలో కూలిన పైకప్పు- 21 మంది మృతి
author img

By

Published : Jan 3, 2021, 3:34 PM IST

Updated : Jan 3, 2021, 8:42 PM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో బంధువు అంత్యక్రియలకు హాజరై పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిపై మృత్యువు పంజా విసిరింది. మురాద్‌నగర్‌లో జైరామ్‌ అనే వ్యక్తి అంత్యక్రియలకు ఆయన బంధువులు హాజరయ్యారు. అక్కడ శ్మశానవాటిక ప్రాంగణంలోని పైకప్పు కూలి 23 మంది మృత్యువాత పడ్డారు.

కూలిన భవనం పైకప్పు- ఐదుగురు మృతి

వర్షం కురుస్తోందని వారంతా అక్కడి వరండా కిందకు చేరగా ఒక్క సారిగా పైకప్పు కూలింది. ఈ సంఘటనలో మరో 15 మంది గాయపడ్డారు. గాయపడ్డ పలువురిని అధికారుల రాక ముందే వారి బంధువులు ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంది.

05 people died after wall collapsed at crematorium ghat premises in Ghaziabad
కూలిన భవనం పైకప్పు- ఐదుగురు మృతి

కేంద్ర మంత్రి, గాజియాబాద్‌ ఎంపీ వి.కె.సింగ్‌ సంఘటనా స్ధలానికి విచ్చేసి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

కూలిన భవనం పైకప్పు

ఇదీ చూడండి: సొమ్మసిల్లి పడిన కేంద్ర మంత్రి- ఆస్పత్రిలో చేరిక

Last Updated : Jan 3, 2021, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.