కరోనా కట్టడికి భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన దేశీయ టీకా కొవాగ్జిన్‌ను 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలపై 2, 3 దశల క్లీనికల్ ట్రయల్స్‌కు నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దిల్లీ ఎయిమ్స్, పట్నా ఎయిమ్స్, నాగ్‌పుర్ మెడిట్రినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో దాదాపు 525 మందిపై క్లీనికల్ ట్రయల్స్ జరగనున్నాయి.
ఈ ట్రయల్స్‌కు సంబంధించి భారత్ బయోటెక్ పెట్టుకున్న విజ్ఞాపనపై పూర్తి స్థాయి చర్చల అనంతరం కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ) నిపుణుల కమిటీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ట్రయల్స్‌కు సంబంధించిన ప్రతిపాదనలు ఫిబ్రవరి 24నే నిపుణుల కమిటీ ఎదుటకు వచ్చాయి. అయితే ఈ ట్రయల్స్‌కు సంబంధించిన రివైజెడ్ క్లీనికల్ ట్రయల్ ప్రొటోకాల్ సమర్పించాలని నిపుణుల కమిటీ సూచించింది.
ఇదీ చూడండి: 'టీకాలే ఆ వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొంటాయి'