ETV Bharat / bharat

బూస్టర్‌ డోసుగా భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు టీకా

రెండు డోసుల కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారికి 'బూస్టర్‌ డోసు' కింద ఈ చుక్కల మందు టీకా అనువైనదని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. అందుకు అవసరమైన క్లినికల్​ పరీక్షల నిర్వహణ అనుమతి ఇవ్వాలని డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియాకు దరఖాస్తు చేసుకోగా.. ఈ అంశాన్ని సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. మార్చి నాటికి ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Bharat biotech
భారత్‌ బయోటెక్‌
author img

By

Published : Jan 5, 2022, 7:43 AM IST

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకాను (నాసల్‌ వ్యాక్సిన్‌) 'బూస్టర్‌ డోసు' కింద వినియోగించేందుకు అవసరమైన క్లినికల్‌ పరీక్షల నిర్వహణ అనుమతి అంశాన్ని డీసీజీఐకి (డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) పరిశీలిస్తోంది. ఇందుకోసం మంగళవారం సమావేశమై చర్చించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రెండు డోసుల కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారికి 'బూస్టర్‌ డోసు' కింద ఈ చుక్కల మందు టీకా అనువైనదని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది.

'ఒమిక్రాన్‌' కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో 'బూస్టర్‌ డోసు'పై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. అందువల్ల చుక్కల మందు టీకాను బూస్టర్‌ డోసుగా ఇచ్చేందుకు అనువైన క్లినికల్‌ పరీక్షలను నిర్వహిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని భారత్‌ బయోటెక్‌ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసింది. దాదాపు 5,000 మంది వలంటీర్లపై ఈ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో సగం మందిని కొవాగ్జిన్‌, మిగిలిన సగం మందిని కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారి నుంచి ఎంచుకుంటారని తెలుస్తోంది. సాధారణంగా రెండో డోసు తీసుకున్న తర్వాత 6 నుంచి 9 నెలల వ్యవధిలో బూస్టర్‌ డోసు తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుత అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా చుక్కల మందు టీకాపై క్లినికల్‌ పరీక్షలను నిర్వహించి, టీకాను అందుబాటులోకి తీసుకురావాలని భారత్‌ బయోటెక్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫారసు, డీసీజీఐ అనుమతి కోసం ఎదురుచూస్తోంది.

భారత్​లో చుక్కల మందు టీకా ఈ ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే... ఎస్​ఈసీ సమావేశమై రష్యాకు చెందిన స్పుత్నిక్​ లైట్​ టీకా అత్యవసర వినియోగ అనుమతులపై చర్చించనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి:

Molnupiravir India: భారత్​లో కొవిడ్​ ఔషధం ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.