కొవాగ్జిన్ టీకా కంటే కొవిషీల్డ్ వ్యాక్సినే అధికంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందంటూ ఓ జర్నల్‌లో ప్రచురితమైన కథనాన్ని భారత్ బయోటెక్ ఖండించింది. కొవాగ్జిన్ టీకాను కొవిషీల్డ్ వ్యాక్సిన్లను పోలుస్తూ ప్రచురించిన ఈ కథనంపై భారత్ బయోటెక్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకటి, రెండు డోసుల తర్వాత భారత వ్యాక్సిన్ల పనితీరుపై వెలువరించిన ఈ నివేదికలో చాలా లోపాలున్నాయని భారత్ బయోటెక్ వెల్లడించింది.
కొవాగ్జిన్ మూడవదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను జులైలో బహిరంగ పరుస్తామని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ డేటాను తొలుత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)కు సమర్పిస్తామని.. ఆ తర్వాత వాటిని రివ్యూ జర్నల్స్‌కు అందిస్తామని తెలిపింది. మూడోదశ అధ్యయన తుది విశ్లేషణ డేటా అందుబాటులోకి వచ్చాక కొవాగ్జిన్ పూర్తి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటామని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: కొవాగ్జిన్, కొవిషీల్డ్.. రెండూ భేష్