ETV Bharat / bharat

మంచు కురిసే వేళ డ్రైవింగ్ చేస్తున్నారా? - అయితే ఈ జాగ్రత్తలు పాటించకుంటే ప్రమాదమే! - పొగమంచులో ప్రయాణానికి సేఫ్టీ టిప్స్

Tips to Driving at Foggy Weather : ప్రస్తుతం వింటర్​ సీజన్ నడుస్తోంది. ​ఓ వైపు చలి.. మరోవైపు పొగమంచుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్​ చేసేవారికి ఈ పరిస్థితి చాలా కష్టం. ఈ టైమ్​లో ఏమాత్రం అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసినా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పొగమంచు కురుస్తున్న సమయంలో ఈ టిప్స్ పాటించారంటే జాగ్రత్తగా మీ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అవేంటంటే..

Best Tips to Driving at Foggy Weather
Best Tips to Driving at Foggy Weather
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 10:49 AM IST

Best Tips to Driving at Foggy Weather : దేశమంతటా రోజురోజుకు చలి పెరిగిపోతోంది. దీనికితోడు చాలా చోట్ల దట్టమైన పొగమంచు మరింత ఇబ్బంది పెడుతోంది. ఉదయం, సాయంత్రం సమయంలో డ్రైవింగ్(Driving) చేసేవారికి ఇది ప్రాణసంకటంగా మారుతోంది. కాబట్టి ఈ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది అనుభవజ్ఞులైన డ్రైవర్లు కూడా ఇలాంటి సందర్భాల్లో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. అయితే ఈ సమయంలో మీరు రోడ్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ టిప్స్ పాటించారంటే.. పొగమంచు వల్ల కలిగే సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

లో బీమ్‌ లైట్లనే వినియోగించాలి : పొగమంచు కురుస్తున్న ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది డ్రైవర్లు సరైన అవగాహన లేకపోవడంతో హైబీమ్‌ లైట్లను వినియోగిస్తుంటారు. ఎందుకంటే అవి ఎక్కువ కాంతినిస్తాయని భావిస్తారు. కానీ, ఈ హైబీమ్ లైట్ల కారణంగా వచ్చే కాంతి పొగమంచులో కలిసిపోతుందనే విషయం మర్చిపోతారు. అదే లోబీమ్‌ లైట్లను వినియోగిస్తే.. ఎదురుగా వస్తున్న వాహనాల డ్రైవర్లకు మీ వాహనం ఎక్కడ ఉందో ఈజీగా తెలుస్తుంది. ఫలితంగా వారు ముందుగా అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ సమయాల్లో మీ వాహనంలో ఫాగ్ లైట్లు వస్తే వాటిని ఆన్​లో ఉంచాలి. ఇవి కూడా చాలా వరకు ప్రమాదాల నుంచి సురక్షితంగా కాపాడతాయి.

వార్నింగ్ లైట్​ ఆన్ చేసుకోవాలి : దట్టమైన పొగమంచు ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వార్నింగ్ లైట్‌ను ఆన్‌ చేసుకొని ప్రయాణించడం బెటర్. ఫలితంగా మనకు ఎదురుగా, వెనుక వైపు వచ్చే వాహనదారులు మన వాహనం డైరెక్షన్ గుర్తించే అవకాశం ఉంటుంది.

నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలి : ఈ సమయంలో అతివేగం చాలా ప్రమాదకరం. ఎందుకంటే తక్కువ విజిబిలిటీ కారణంగా, ఏదైనా వాహనం ఒక్కసారిగా మీ ముందు కనిపించే అవకాశం ఉంది. దాంతో ప్రమాదం చోటుచేసుకోవచ్చు. కాబట్టి వీలైనంత నెమ్మదిగా డ్రైవింగ్‌ చేయడం మంచిది.

హెచ్చరికలను ఫాలో అవ్వాలి : ప్రస్తుతం చాలా వరకు రాష్ట్ర, జాతీయ రహదారులపై రేడియం లైటింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇవి రోడ్లను రెండుగా విభజిస్తున్నాయి. అలాగే బ్రిడ్జి, ఇరుకైన రోడ్ల వద్ద అదనపు రేడియమ్ లైటింగ్‌, తెలుపు, పసుపు రంగుల్లో వార్నింగ్ బోర్డ్స్ పెడుతున్నారు. అయితే వీటిని సరిగా అనుసరించడం ద్వారా కూడా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.

డ్రైవింగ్‌ చేయాలంటే భయపడుతున్నారా? ఈ టిప్స్​తో దూసుకెళ్లండి!

ఢీ ఫాగర్‌ వినియోగం : వెహికల్ అద్దాల మీద ఉన్న మంచును కరిగించేందుకు డీ ఫాగర్‌ను వినియోగిస్తారు. వింటర్​లో పొగమంచు కారణంగా కారు ముందు, వెనుక అద్దాల మీద తెల్లగా మంచు పేరుకుపోతుంది. దాంతో రోడ్డును సరిగా చూసేందుకు అవకాశం ఉండదు. కాబట్టి చాలా కార్ల తయారీ సంస్థలు ఈ మంచును ఆటోమేటిక్‌గా కరిగించేందుకు ఢీ ఫాగర్‌ను అందిస్తున్నాయి. ఇది గ్లాసెస్​ను వెడేక్కేలా చేసి మంచును కరిగిస్తుంది.

స్పీకర్ల సౌండ్‌ తగ్గించండి : ఇలాంటి వాతావరణంలో ప్రయాణం చేస్తున్న సమయంలో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా మందికి పాటలు వింటూ డ్రైవింగ్ చేసే అలవాటు ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భాల్లో మ్యూజిక్‌ సిస్టమ్‌ సౌండ్‌ను వీలైనంత తక్కువగా ఉంచాలి. అవసరమయితే పూర్తిగా సౌండ్‌ ఆఫ్‌ చేసినా మంచిది.

తగిన దూరం పాటించండి : అలాగే పొగమంచు ఉన్న ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముందున్న వాహనాలతో తగినంత దూరాన్ని పాటించాలి. ఎందుకంటే ముందున్న వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనా.. వెంటనే స్పందించి అప్రమత్తమయ్యేందుకు సమయం దొరుకుతుంది. టెయిల్‌ లైట్లు, బ్రేక్‌ లైట్ల ద్వారా ముందున్న వాహనాలను అనుసరించవచ్చు.

హెడ్ లైట్స్ చెక్ చేసుకోండి : ఇక చివరగా పొగమంచు, రాత్రి వేళల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు వాహనం హెడ్‌లైట్ల పనితీరును ఓసారి చెక్ చేసుకోవాలి. అలాగే ఒక లైట్ మాత్రమే పనిచేస్తున్న సమయంలో మీ జర్నీని వాయిదా వేసుకోవడం బెటర్. ఎందుకంటే సింగిల్‌ హెడ్‌లైట్‌ కారణంగా.. వాహనం టూ వీలర్‌ అని పొరపాటు పడే అవకాశం ఉంది. దాంతో ప్రమాదాలు చోటుచేసుకోవచ్చు.

డ్రైవింగ్​​ చేస్తున్నప్పుడు బ్రేకులు ఫెయిల్ అయ్యాయా?-ఈ టిప్స్ తెలిసి ఉంటే ఈజీగా ప్రమాదం నుంచి బయటపడొచ్చు!

తక్కువ ప్రీమియంతో కార్ ఇన్సూరెన్స్.. మహిళా డ్రైవర్లైతే ఈ యాడ్-ఆన్స్ మస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.