Best 5 Ways to Find Public Toilets Anywhere : తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడు పబ్లిక్ టాయిలెట్(Public Toilets) ఎక్కడ ఉందో తెలియక చాలా మంది అవస్థ పడుతుంటారు. ప్రత్యేకించి మహిళలు మరింతగా ఇబ్బంది పడతారు. అయితే.. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఇంతకుమునుపులా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీ ఫోన్ ద్వారానే.. పబ్లిక్ టాయిలెట్స్‌ని లోకేషన్‌తో సహా తెలుసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ 5 ఉత్తమ మార్గాలు ఉన్నాయి. అవేంటో చూడండి.
How to Find Public Toilet Use Google Maps :
Google మ్యాప్స్ ఉపయోగించి పబ్లిక్ టాయిలెట్ కనుగొనండిలా..
- మొదట మీ Android లేదా iPhoneలో Google Maps (Android, iOS)ని ఓపెన్ చేసి.. location servicesకి వెళ్లాలి.
- ఆ తర్వాత సెర్చ్ బాక్స్‌లో Public Toliet, Restroom లేదా Sulabh near me అని సెర్చ్ చేయాలి.
- అప్పుడు మీకు సమీపంలోని అన్ని పబ్లిక్ రెస్ట్‌రూమ్‌ల జాబితా వస్తుంది.
- అవి ఓపెన్‌లో ఉన్నాయా లేదా మూసివేయబడి ఉన్నాయా అనే స్టేటస్ కూడా కనిపిస్తుంది.
- ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న దాన్ని ఎంచుకొని Directionsపై క్లిక్ చేసి ఆ ప్రాంతానికి నావిగేట్ చేయాలి.
- అంతే సింపుల్‌గా మీకు దగ్గరలోని పబ్లిక్ టాయిలెట్‌కు చేరుకుంటారు.
- ప్రత్యామ్నాయంగా, మీరు Google అసిస్టెంట్‌ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా కూడా మీ సమీపంలోని పబ్లిక్ రెస్ట్‌రూమ్‌లను గుర్తించవచ్చు.
How to Find Public Toilet Use Apple Maps :
Apple Maps ఉపయోగించి రెస్ట్‌రూమ్స్ కనుగొనండిలా..
- మొదట మీరు మీ iPhone లేదా iPadలో Apple Mapsను ఓపెన్ చేసి.. location services ఎనేబుల్ చేయాలి.
- అనంతరం సెర్చ్ బార్లో Public Toliet or ‘Restroom అని సెర్చ్ చేయాలి.
- అప్పుడు పని వేళలతో సహా మీ సమీపంలోని అన్ని పబ్లిక్ రెస్ట్‌రూమ్‌ల జాబితా చూపిస్తుంది.
- అంతే.. మీకు దగ్గరలోని దాన్ని ఎంచుకొని అక్కడకు చేరుకోవచ్చు.
క్షణాల్లో పబ్లిక్ టాయిలెట్స్ జాడ గూగుల్ మ్యాప్స్‌లో..!
How to Find Restrooms Use Mappls in India Only :
Mappls ఉపయోగించండి భారత్‌లో పబ్లిక్ టాయిలెట్ కనుగొనండిలా..
- మీ ఫోన్‌లో మొదట లొకేషన్ ఆన్ చేసి.. Mappls యాప్ (Android, iOS)ని ఓపెన్ చేయండి.
- ఆ తర్వాత సెర్చ్ బార్‌ని ఉపయోగించి Public Toliet or Restroom అని సెర్చ్ చేయాలి.
- అప్పుడు అది పని వేళలతో సహా మీ సమీపంలోని అన్ని పబ్లిక్ రెస్ట్‌రూమ్‌లను జాబితా డిస్ప్లే చేస్తుంది.
- దీని ద్వారా మీరు పబ్లిక్ టాయిలెట్లను కనుగొనవచ్చు.
థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా కూడా..
How to Find Public Toilet Through Third-Party Apps : అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని పబ్లిక్ టాయిలెట్ లేదా రెస్ట్‌రూమ్‌ను గుర్తించడానికి కొన్ని ప్రత్యేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. "టాయిలెట్ ఫైండర్", "ఫ్లష్ పబ్లిక్ టాయిలెట్" అనే యాప్స్ ద్వారా కూడా మీరు సమీపంలోని పబ్లిక్ టాయిలెట్స్ లేదా రెస్ట్ రూమ్స్ సింపుల్‌గా తెలుసుకోవచ్చు. మొదటగా.. మీ ఫోన్‌లో వీటిని ఇన్స్టాల్ చేసుకుని Location Permissionకి అనుమతించాలి. ఆ తర్వాత సెర్చ్ బాక్స్‌లో Public Toilet Near Me అని సెర్చ్ చేస్తే చాలు దగ్గరలోని జాబితాను చూపిస్తుంది. మీకు సమీపంలో దాన్ని ఎంచుకుని నడక మార్గం ద్వారానే అక్కడికి వెళ్లొచ్చు.
శౌచాలయాల నిర్మాణాల్లో అక్రమాలు.. నీరుగారిపోతున్న లక్ష్యం
టోల్-ఫ్రీ నంబర్‌లకు కాల్ చేసి సమీపంలోని రెస్ట్‌రూమ్ తెలుసుకోండిలా..
How to Find Public Toilet Through Call Toll-Free Numbers : మీ సమీపంలోని పబ్లిక్ రెస్ట్‌రూమ్ లేదా టాయిలెట్ గురించిన వివరాల కోసం మీరు స్థానిక టోల్-ఫ్రీ సర్వీస్ హెల్ప్‌లైన్‌కు కూడా కాల్ చేయవచ్చు. 000 800 9191 000 నంబర్‌ను సంప్రదించి.. వివరాలు తెలుసుకోవచ్చు.