ETV Bharat / bharat

గది ఉష్ణోగ్రత వద్ద టీకా​ నిల్వ​- పోర్టబుల్​ వెంటిలేటర్​! - బెంగళూరు ఐఐఎస్​సీ

గది ఉష్ణోగ్రత నిల్వ చేసే వ్యాక్సిన్​ను అభివృద్ధి చేస్తున్న కర్ణాటక బెంగళూరులోని ఐఐఎస్​సీ పరిశోధక బృందాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్​ అభినందించారు. ఈ వ్యాక్సిన్​ గనుక అందుబాటులోకి వస్తే.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ ప్రక్రియ అతివేగంతో జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు.. కరోనా రోగుల కోసం అసోంలోని తేజ్​పుర్​ విశ్వావిద్యాలయ విద్యార్థులు పోర్టబుల్​ వెంటిలేటర్​ను​ రూపొందిస్తున్నారు.

portable ventilator, new covid-19 vaccine
గది ఉష్ణోగ్రత వద్ద టీకా​ నిల్వ​- పోర్టబుల్​ వెంటిలేటర్​!
author img

By

Published : May 14, 2021, 6:26 PM IST

Updated : May 14, 2021, 10:06 PM IST

గది ఉష్ణోగ్రత నిల్వ చేసే కొవిడ్​ వ్యాక్సిన్​ను కర్ణాటక బెంగళూరులోని ఐఐఎస్​సీ అభివృద్ధి చేస్తోంది. కరోనా మహమ్మారిపై పోరులో ఈ వ్యాక్సిన్​.. కీలక పాత్ర పోషిస్తుందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్​ కె.సుధాకర్​ పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ గురించి తెలుసుకునేందుకు ఐఐఎస్​సీ డైరెక్టర్​ గోవిందన్​ రంగరాజన్​తో ఆయన సమావేశమయ్యారు.

"ఈ టీకా గనుక అందుబాటులోకి వస్తే దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతంగా మారుతుంది. కొవిడ్​ నివారణ కోసం ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్న వ్యాక్సిన్ల కంటే.. ఐఐఎస్​సీ అభివృద్ధి చేసిన కొవిడ్​ టీకా సమర్థంగా పని చేస్తుందని ఆశిస్తున్నాను."

- కె.సుధాకర్​, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి

అయితే.. మానవులపై ఈ వ్యాక్సిన్​ ప్రయోగాలు చేపట్టాల్సి ఉందని ఐఐఎస్​సీ తెలిపింది.

IISc developing new covid-19 vaccine
ఐఐఎస్​సీ డైరెక్టర్​తో మాట్లాడుతున్న కర్ణాటక ఆరోగ్య మంత్రి

ఐఐఎస్​సీ శాస్త్రవేత్తలు చేస్తున్న వివిధ పరిశోధనల గురించి మంత్రికి గోవిందన్​ రంగరాజన్​ వివరించారు. తాము 10 ఎల్​పీఎం(లీటర్స్​ పర్​ మినిట్​) సామర్థ్యంతో పని చేసే ఓ ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్​ను తయారు చేస్తున్నామని చెప్పారు.

ఈ పరికరం ద్వారా రోగులకు 90 శాతం ఆక్సిజన్​ అందుతుందని ఐఐఎస్​సీ అధికారులు తెలిపారు. ఇది చైనాలో తయారైన ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ల కంటే.. ఎక్కువ సమర్థంగా పని చేస్తుందని పేర్కొన్నారు. బెంగళూరు వైద్య కళాశాలలో ఈ పరికరంపై క్రినికల్​ ధ్రువీకరణ పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు.

ఇదీ చూడండి: భారత్​, బంగ్లా జవాన్ల రంజాన్​ వేడుకలు

పోర్టబుల్​ వెంటిలేటర్..

తేజ్​పుర్​ విశ్వవిద్యాలయ విద్యార్థులు రూపొందిస్తున్న పోర్టబుల్​ వెంటిలేటర్​

ప్రస్తుత కొవిడ్​ విజృంభణ వేళలో.. వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అసోం తేజ్​పుర్​ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్​ విభాగ విద్యార్థులు వినూత్న ఆవిష్కరణ చేపట్టారు. పోర్టబుల్​ వెంటిలేటర్​ను వారు అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారు చేపట్టిన ఈ ప్రాజెక్టుకు క్లాస్​ 88 ఫౌండేషన్​ నుంచి 'బెస్టు ఇన్నోవేటివ్​ ఇంజినీరింగ్​ ఐడియా' పురస్కారం లభించింది.

portable ventilator
తేజ్​పుర్​ విశ్వవిద్యాలయ విద్యార్థులు అభివృద్ధి చేస్తున్న పోర్టబుల్​ వెంటిలేటర్​
portable ventilator
వెంటిలేటర్​ను పరీక్షిస్తున్న విద్యార్థి

బిహుంగ్​ ముచాహరి, అనికేత్​​ రాజ్​, మనీష్​ కుమార్​, అంకితా దాస్​ అనే విద్యార్థుల బృందం ఈ ప్రాజెక్టును చేపట్టింది. చిరంజిత్ అధికారి, ఫిర్దాసా అహ్మద్​ అనే ఇద్దరు మాజీ గెస్టు ఫ్యాకల్టీల ఆధ్వర్యంలో వారు ఈ పరికరాన్ని అభివృద్ధి చేయటం ప్రారంభించారు. దీన్ని ప్రొఫెసర్​ సౌమిక్​ రాయ్​ పర్యవేక్షించారు. 'అంబు బ్యాగ్'​ సహాయంతో ఈ పోర్టబుల్​ వెంటిలేటర్​ పరికరం పని చేస్తుందని సౌమిక్​ రాయ్​ తెలిపారు. యాప్​ ద్వారా దీన్ని నియంత్రిచ్చవచ్చని పేర్కొన్నారు. రూ. 8,000 నుంచి రూ.15,000 ధరలో ఈ పరికరాన్ని తాము అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

ఇదీ చూడండి: భార్యపై ప్రేమతో.. ఇంట్లోనే నిలువెత్తు విగ్రహం

Last Updated : May 14, 2021, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.