చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే ఓ వృద్ధురాలు తన ఇంగ్లీష్‌తో ఇంటర్నెట్ను ఊపేస్తోంది. బెంగళూరులో ఉండే ఆ వృద్ధురాలికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ మహిళ మాట్లాడుతున్న ఇంగ్లీష్ చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు నెటిజన్లు.
సిసిలియా మార్గరెట్ లారెన్స్ అనే వృద్ధురాలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సచినా హెగ్గర్ అనే నెటిజెన్. 'కథలు ఎప్పుడూ మీ చుట్టూనే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఆగి, చుట్టూ చూడటమే. కొన్ని అందమైనవి, మరికొన్ని బాధాకరమైనవి కనిపిస్తాయి.' అని రాసుకొచ్చారు హెగ్గర్.
ఆమె గురించి అడగగా.. తాను ఓ చర్చిని శుభ్రం చేస్తానని, ప్లాస్టిక్ వస్తువులను సేకరించి అమ్ముకుంటూ జీవిస్తానని చెప్పినట్లు తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
వీడియోలో.. తన జీవితంలో జరిగిన పరిణామాలను వివరించింది వృద్ధురాలు. తాను 2007-14 వరకు ఏడేళ్ల పాటు జపాన్‌లో నివసించినట్లు చెప్పుకొచ్చింది. ఓ పాట కూడా పాడి వినిపించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: ఒకప్పుడు ఐఐటీ ఇంజినీర్.. ఇప్పుడు యాచకుడు