ETV Bharat / bharat

'రాత్రి 11 దాటితే రోడ్డు మీద తిరగకూడదు.. రూ.3వేలు ఫైన్!'.. దంపతులకు పోలీసుల వేధింపులు

ప్రజలను కాపాడాల్సిన పోలీసులు వారిని వేధించడం చర్చనీయాంశమైంది. బర్త్​డే వేడుకలకు హాజరై తిరిగి వస్తున్న దంపతులను.. రూ.3,000 జరిమానా కట్టాలని పోలీసులు డిమాండ్ చేశారు. అర్ధరాత్రి రోడ్లు మీద తిరిగేందుకు అనుమతి లేదని దంపతులను హెచ్చరించారు. కర్ణాటకలో ఈ ఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చేరింది.

cops forced to pay fine
దంపతులను వేధించిన పోలీసులు
author img

By

Published : Dec 11, 2022, 5:32 PM IST

భార్యాభర్తల్ని బెంగళూరు పోలీసులు వేధించారన్న ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. రాత్రి 11 గంటల తర్వాత రోడ్డు మీద తిరగకూడదని పోలీసులు తమను బెదిరించారని ఓ వ్యక్తి ఆరోపించారు. రూ.3,000 జరిమానా కట్టాలని డిమాండ్ చేశారని చెప్పారు. అసలేం జరిగిందంటే..
ఇదీ జరిగింది..
బెంగళూరుకు చెందిన భార్యాభర్తలు.. గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నారు. పెట్రోలింగ్ కోసం వ్యానులో వచ్చిన ఇద్దరు పోలీసులు వారిని ఆపారు. చట్టాన్ని ఉల్లంఘించి రాత్రి సమయంలో బయట తిరుగుతున్నందుకు రూ.3,000 జరిమానా చెల్లించాలని దంపతులను డిమాండ్​ చేశారు. బర్త్​డే పార్టీకి వెళ్లి వస్తున్నామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. వారిని పోలీసులు ఎలా వేధింపులకు గురిచేశారో బాధితుడు కార్తీక్ పత్రి.. ట్విట్టర్​లో రాసుకొచ్చారు. దానిని బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్​కు ట్యాగ్​ చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు.. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. వారిపై శాఖాపరమైన విచారణ జరుపుతున్నామని తెలిపారు.

  • I would like to share a traumatic incident my wife and I encountered the night before. It was around 12:30 midnight. My wife and I were walking back home after attending a friend’s cake-cutting ceremony (We live in a society behind Manyata Tech park). (1/15)

    — Karthik Patri (@Karthik_Patri) December 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'నేను నా భార్యతో కలిసి గురువారం రాత్రి 12.30 సమయంలో ఎదుర్కొన్న ఒక బాధాకరమైన ఘటన గురించి చెప్పాలని అనుకుంటున్నా. నా స్నేహితుడి బర్త్​డే పార్టీకి వెళ్లి ఇద్దరం వస్తున్నాం. పెట్రోలింగ్ వ్యాన్​లో వచ్చి ఇద్దరు కానిస్టేబుళ్లు మమ్మల్ని ఆపారు. ఐడీ కార్డులు చూపించమని అడిగారు. వెంటనే నా ఫోన్​లో ఉన్న ఆధార్ కార్డు ఫొటోలను చూపించాం. అంతలో నా వద్ద ఉన్న మొబైల్​ను పోలీసులు తీసుకున్నారు. అయినా వారి పట్ల మేము కోపగించుకోలేదు. వారు అడిగిన ప్రశ్నలకు మేము మర్యాదపూర్వకంగానే సమాధానం ఇచ్చాం. అంతలోనే పోలీసులు చలానా బుక్​ తీసి మా పేర్లు, ఆధార్ నెంబర్లు రాయడం ప్రారంభించారు. ఎందుకు చలాన్ రాస్తున్నారని అడిగాను. రాత్రి 11 గంటల తర్వాత రోడ్డుపై తిరగడానికి అనుమతి లేదని చెప్పారు. అలాంటి రూల్స్ లేదని తెలిసినా.. అర్ధరాత్రి కావడం వల్ల మౌనంగా ఉండిపోయా. పోలీసులకు క్షమాపణలు చెప్పాం. కానీ వారు మమ్మల్ని విడిచిపెట్టేందుకు నిరాకరించారు. జరిమానాగా రూ.3,000 కట్టమని డిమాండ్ చేశారు. చివరకు రూ.1,000 కట్టేందుకు అంగీకరించా.'

--కార్తీక్ పత్రి, బాధితుడు

దంపతులు ఎంత వేడుకున్నా పోలీసులు కనికరించలేదు. జరిమానా చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాధితులను బెదిరించారు. అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. పేటియం క్యూ ఆర్ కోడ్​ స్కాన్ చేసి రూ.1,000 రూపాయలు చెల్లించారు కార్తీక్. ఈ విషయం ట్విట్టర్ ద్వారా ఉన్నతాధికారులకు చేరడం వల్ల ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు ఎవరికైనా ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని బెంగళూరు పోలీసులు సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.