అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెంగళూరులోని హితుల్స్ హోలిస్టిక్ సెంటర్ ప్రత్యేక వెబినార్‌ను నిర్వహించింది. ఉదయం 5 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యాన్ని నిపుణులు వివరించారు. పని ప్రదేశాల్లో కుర్చీలో కూర్చునే సూర్యనమస్కారం చేయడం సహా మరికొన్ని సులువైన ఆసనాలు ఎలా వేయాలో నేర్పించారు.
యోగాను జీవితంలో ఓ భాగం చేసుకోవడం ఎంతో అవసరమని హితుల్స్ హోలిస్టిక్ సెంటర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ వైవీ రత్న ఈ సందర్భంగా అన్నారు.
జ్ఞాన భాండాగారం..
డాక్టర్ వై.వి.రత్న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డారు. 2003లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ డిగ్రీ పూర్తి చేశారు. మదర్ థెరిసా మహిళా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్, పీహెచ్డీ పట్టా పొందారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి మెంటల్ హెల్త్, షిమోగా, ఆక్యుప్రెషర్ థెరపీలో అడ్వాన్స్ డిప్లొమా చేశారు. కౌన్సెలింగ్, సైకోథెరపీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. 2004 నుంచి కర్ణాటకలోని బెంగళూరు సిటీ కాలేజ్, మిరాండా డిగ్రీ కళాశాల, హిందుస్తాన్ బిజినెస్ స్కూల్, పైలట్లకు ఇంగ్లీష్ బోధించారు.
ప్రస్తుతం బెంగుళూరులోని హితుల్స్ హోలిస్టిక్ కేంద్రానికి డైరెక్టర్, ఎండీగా వ్యవహరిస్తున్న డా. వై.వి.రత్న.. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి: Yoga: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి యోగాసనాలు