ETV Bharat / bharat

రెండో దశ: బంగాల్​లో 86%, అసోంలో 81% పోలింగ్​

author img

By

Published : Apr 3, 2021, 5:28 AM IST

బంగాల్​, అసోం అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్​ తుది ఓటింగ్​ గణాంకాలను ప్రకటించింది ఎన్నికల సంఘం. బంగాల్​లో 86 శాతం, అసోంలో 80.96 శాతం పోలింగ్​ నమోదైనట్లు వెల్లడించింది. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో నిలిచిన నందిగ్రామ్​లో 88.01 శాతం పోలింగ్​ రికార్డయింది.

Bengal, Assam polls
బంగాల్​, అసోం అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్​

బంగాల్​లో గురువారం ముగిసిన రెండో దశ ఎన్నికల్లో 86.11 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నాలుగు జిల్లాల్లోని 30 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈనెల 1న ఎన్నికలు ముగిసిన తర్వాత పోలింగ్​లో 75.94 లక్షల మంది పాల్గొన్నారని, 80.43 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ప్రకటించింది ఈసీ. తాజాగా తుది గణాంకాలు విడుదల చేసింది.

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి బరిలో నిలిచిన నందిగ్రామ్​లో 88.01 శాతం ఓటింగ్​ నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆరిజ్​ అఫ్తాబ్​ తెలిపారు. జిల్లాల వారిగా చూస్తే.. పుర్బా మేదినీపుర్​లో అత్యధికంగా 87.42 శాతం ఓటింగ్​ నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో బంకుర (86.98 శాతం), దక్షిణ 24 పరగణాలు (86.74 శాతం), పశ్చిమ్​ మేదినీపుర్​ (83.84 శాతం) ఉన్నాయి. బంకుర జిల్లాలోని కోతుల్​పుర్​ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 90 శాతం పోలింగ్​ నమోదైంది. అత్యల్పంగా పశ్చిమ్​ మేదినీపుర్​లోని ఖారగ్​పుర్​ సదార్​ నియోజకవర్గంలో 72.68 శాతం ఓటింగ్​ నమోదైంది.

మార్చి 27న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 84.63 శాతం ఓటింగ్​ నమోదైంది.

అసోంలో.. 81శాతం

అసోం అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో 80.96 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలి దశ (79.93)తో పోలిస్తే 1.03 శాతం అధికమని తెలిపింది. రెండో దశలో మొత్తం 39 నియోజకవర్గాల్లో ఓటింగ్​ జరిగింది.

ఎన్నికలు ముగిసిన తర్వాత పోలింగ్​ శాతం 77.21గా ప్రకటించినప్పటికీ.. తుది గణాంకాల ప్రకారం 80.96గా తేలిందని ఈసీ వెల్లడించింది. మొత్తం ఓటర్లలో పురుషులు 37,34,537 మంది (81 శాతం), మహిళలు 36,09,959 మంది (80.94 శాతం), ట్రాన్స్​జెండర్లు 135 (5.9 శాతం) మంది ఓటింగ్​లోపాల్గొన్నారు. అత్యధికంగా మంగల్​దోయ్​, కాటిగోర్​ నియోజకవర్గాల్లో 85.71 శాతం పోలింగ్​ నమోదైంది. అత్యల్పంగా కరిమ్​గంజ్​ (ఉత్తరం)లో 73.89 శాతం ఓటింగ్​ రికార్డయింది.

ఇదీ చూడండి: ఉద్రిక్తతల నడుమ బంగాల్​- ప్రశాంతంగా అసోంలో పోలింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.