ETV Bharat / bharat

'అంకుల్​ జీ' కామెంట్​కు గవర్నర్​ స్ట్రాంగ్​ కౌంటర్ - jagdeep dhankhar vs mamata banerjee

తృణమూల్ కాంగ్రెస్​ ఎంపీ మహువా మొయిత్రి వ్యాఖ్యలపై బంగాల్​ గవర్నర్​ స్పందించారు. ఎంపీ ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

bengal governer jagdeep dhankar, బంగాల్​ గవర్నర్​ జగదీప్​ ధన్​కర్
తృణమూల్​ ఎంపీ వ్యాఖ్యలపై బంగాల్​ గవర్నర్​ స్పందన
author img

By

Published : Jun 7, 2021, 3:45 PM IST

బంగాల్‌ రాజ్‌భవన్‌ మొత్తాన్ని గవర్నర్ కుటుంబీకులు, పరిచయస్తులతో నింపేశారన్న తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ మహువా మొయిత్రి వ్యాఖ్యలను ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ కొట్టిపారేశారు. ఈ ఆరోపణలు అవాస్తవం అని స్పష్టం చేశారు. వారు తన కుటుంబ సభ్యులు కాదని, వివిధ రాష్ట్రాలకు చెందినవారని వివరణ ఇచ్చారు.

  • Assertion @MahuaMoitra in tweet & Media that six coterminous appointee OSDs in personal staff are relatives is FACTUALLY WRONG.

    OSDs are from three states and belong to four different castes.

    None of them is part of close family. Four of them are not from my caste or state.

    — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) June 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"తృణమూల్​ నేత మహువా మొయిత్రి చేసిన ఆరోపణలలో వాస్తవం లేదు. ఎంపీ ఆరోపిస్తున్న వారంతా మూడు రాష్ట్రాలకు, నాలుగు వేర్వేరు కులాలకు చెందిన వారు. వీరిలో ఏ ఒక్కరూ నా కుటుంబానికి సన్నిహితులు కారు. ఈ ఆరుగురికీ నా కులంతో కానీ, రాష్ట్రంతో కానీ సంబంధం లేదు. ప్రస్తుతం బంగాల్​లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్న వేళ ఈ పరిస్థితుల నుంచి దారి మళ్లించేందుకే తృణమూల్​ కాంగ్రెస్​ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నా బాధ్యతను నిర్వర్తిస్తాను."

-జగ్​దీప్​ ధన్​కర్, బంగాల్​ గవర్నర్​

మెయిత్రా స్పందన..

గవర్నర్​ వ్యాఖ్యలపై ఎంపీ మహువా మొయిత్రి స్పందించారు.

"గవర్నర్​ వద్ద స్పెషల్​ డ్యూటీ చేస్తున్న అధికారులది సామాన్య పదవి కాదు. రాజ్​భవన్​ వెబ్​సైట్​లో అధికారుల జాబితాలో చూపిస్తున్న షెకావత్​, దీక్షిత్​, ధన్​కర్​ ఎవరు? వీరితో ఎలాంటి సంబంధం లేదని గవర్నర్​ అబద్ధం చెప్తున్నారు. ఈ ఆరుగురు అధికారులు రాజ్​భవన్​లోకి ఎలా ప్రవేశించారన్న దానిపై గవర్నర్​ వివరణ ఇవ్వాలి."

-మహువా మొయిత్రి

అంతకుముందు.. బంగాల్ రాజ్‌ భవన్ ప్రత్యేక విధుల్లో.. ఆరుగురు అధికారులను తన కుటుంబసభ్యులు, పరిచయస్తులతో గవర్నర్ ధన్‌కర్‌ నింపేశారని.. ఎంపీ మహువా మొయిత్రి ఆరోపించారు. గవర్నర్ జగదీప్ ధన్‌కర్​ను అంకుల్ జీ అంటూ సంబోధించిన ఎంపీ ఈ మేరకు పలు పేర్లతో కూడిన జాబితాను ఆమె ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఇదీ చదవండి : బంగాల్, ఒడిశాలో కేంద్ర మంత్రుల పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.