Conquers Mount Everest Without Oxygen Cylinder: బంగాల్లోని చందన్‌నగర్‌కు చెందిన పర్వతారోహకురాలు పియాలీ బసక్(31).. ఆక్సిజన్ సిలిండర్ సహాయం లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఆదివారం ఉదయం 8:30 గంటలకు పియాలీ ఈ ఘనత సాధించి తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించారు. అందుకోసం ఆమె గత కొంత కాలంగా నిరంతర సాధన చేస్తున్నారు. ఎవరెస్ట్ అధిరోహించడానికి రిహార్సల్‌గా ప్రపంచంలోని ఏడో ఎత్తైన శిఖరమైన ధౌలగిరిని.. ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే పియాలీ జయించారు.
![Conquers Mount Everest Without Oxygen Cylinder](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/wb-hgl-piyaliclimbedeverestwithoutsupplimentoxygen-7203418_22052022122600_2205f_1653202560_936_2205newsroom_1653218974_126.jpg)
అయితే, ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని జయించడానికి కొద్ది రోజుల క్రితం బేస్ క్యాంపు నుంచి ఆమె ఒక వీడియో షేర్ చేశారు. అందులో రూ.12 లక్షలు డిపాజిట్ చేయలేక ఎవరెస్ట్‌ను జయించాలన్న తన కల ఆగిపోయే ఛాన్స్ ఉందని బాధపడ్డారు. అయితే ఆక్సిజన్ సిలిండర్లు లేకుండా ఎవరెస్ట్, లోటస్‌ను జయించడమే తన లక్ష్యమని అన్నారు. "అయితే, ఈ రెండు శిఖరాలను జయించడానికి అయ్యే మొత్తం ఖర్చు రూ.35 లక్షలు. ఇందులో 12 లక్షల రూపాయలు ఏజెన్సీలో జమ చేయాల్సి ఉంది. అది చేయకపోతే ఎవరెస్ట్‌ను జయించినందుకు గుర్తింపు లభించదు" అని పియాలీ వాపోయారు. ఇటువంటి స్థితిలో బంగాల్లోని చందన్‌నగర్ రోటరీ క్లబ్ సభ్యులు పియాలీకి అండగా నిలిచారు. డిపాజిట్ చేయాల్సిన డబ్బును సేకరించి ఇస్తామని హామీ ఇచ్చారు. పియాలీ డిపాజిట్ చేయాల్సిన సొమ్ముకోసం రోటరీ క్లబ్ సభ్యులు సేకరిస్తున్నారు.
![Conquers Mount Everest Without Oxygen Cylinder](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/wb-hgl-piyaliclimbedeverestwithoutsupplimentoxygen-7203418_22052022122600_2205f_1653202560_688_2205newsroom_1653218974_434.jpg)
మరోవైపు పియాలీ సాధించిన విజయం పట్ల ఆమె తల్లి సప్నా బసక్ సంతోషం వ్యక్తం చేశారు. " పియాలీ పడిన కష్టాన్ని నా కళ్లారా చూశాను. అందుకే ఆమె సాధించిన విజయం పట్ల గర్విస్తున్నాను"అని తెలిపారు. అయితే పియాలీ సాధించిన ఈ విజయంలో ఆమె తండ్రి పాలుపంచుకోలేకపోతున్నారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నారు.
ఇవీ చదవండి: రైళ్లలో ఆర్టీసీ బస్సుల రవాణా.. చరిత్రలోనే తొలిసారి..!
బీటెక్‌తో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. జీతం రూ.2 లక్షలకుపైనే!