ETV Bharat / bharat

లైవ్​: చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్​ ప్రశాంతం

Bengal fifth phase polls, polls live updates
బంగాల్ పోలింగ్ , లైవ్ అప్​డేట్స్
author img

By

Published : Apr 17, 2021, 6:58 AM IST

Updated : Apr 17, 2021, 6:28 PM IST

18:23 April 17

పోలింగ్​ ప్రశాంతం..

బంగాల్ ఐదోవిడత ఎన్నికల పోలింగ్.. చెదురుమదురు ఘటనల మధ్య ప్రశాంతంగా జరుగుతోంది. సాయంత్రం 5 వరకు 78.36 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగనుంది. 

ఈ విడతలో 45 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా 342 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని కోటీ 13లక్షలకుపైగా ఓటర్లు.....15వేల 789 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు.

16:22 April 17

4 గంటల వరకు 69 శాతం పోలింగ్​

బంగాల్‌లో మధ్యాహ్నం 4:13 గంటల వరకు 69.40 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 45 స్థానాల్లో ఓటింగ్​ జరుగుతోంది. సాయంత్ర 6 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. 

15:45 April 17

62.4 శాతం పోలింగ్​

బంగాల్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 62.4 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 45 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. గుజరాత్​ ఉపఎన్నికలో మధ్యాహ్నం 3 గంటల వరకు 27 శాతం పోలింగ్​ నమోదైంది. 

టీఎంసీ ఎంపీ మిమి ఛక్రవర్తి.. జల్​పాయ్​గురిలోని పోలింగ్​ బూత్​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

13:49 April 17

బంగాల్ ఐదో విడత అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1:45 గంటల వరకు 54.67  శాతం పోలింగ్ నమోదైంది.

13:28 April 17

ఉత్తర 24 పరగణాలు జిల్లా దేగంగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కురల్​గచ్చా పోలింగ్​ బూత్​ వద్ద కేంద్రం బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. పోలింగ్ స్టేషన్​ ముందు భారీగా గుమిగూడిన సమూహాన్ని చెదరగొట్టేందుకు ఈ చర్యకు పాల్పడ్డాయి. అంతకుముందు ఇక్కడ  లాఠీ ఛార్జ్ కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఎన్నికల సంఘం జిల్లా అధికారులను ఆదేశించింది.

11:55 April 17

బంగాల్​ ఐదో దశ​లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్​ సజావుగా సాగుతోంది. ఉదయం 11.30 వరకు 36.02 శాతం పోలింగ్ నమోదైంది.

11:55 April 17

బూత్​ నెం.265, 272లలో భాజపా కార్యకర్తల రాళ్లదాడిలో ఇద్దరు తృణమూల్ కార్యకర్తలు గాయపడ్డారని మంత్రి సుజిత్ బోస్ తెలిపారు. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉందని స్పష్టంచేశారు.

10:35 April 17

  • West Bengal: Election Commission has sought a report over the sudden death of a BJP polling agent at booth number 107 in Kamarhati today

    "His name is Abhijeet Samant. Nobody helped him, there is no facility for treatment here," says brother of the deceased BJP polling agent pic.twitter.com/vYRvzrbIYC

    — ANI (@ANI) April 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పోలింగ్ ఏజెంట్ మృతి..

కామర్హతిలోని బూత్​ నెం.107 వద్ద అభిజిత్ సమంత్​ అనే భాజపా పోలింగ్ ఏజెంట్ మృతిచెందారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియలేదు. ఆయనకు ఎవరూ సహాయం చేయలేదని, చికిత్స కోసం బూత్​ వద్ద సదుపాయం లేదని అభిజిత్ సోదరుడు తెలిపారు. కాగా, ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

09:48 April 17

బంగాల్​లో ఐదో విడత పోలింగ్​ ప్రశాంతంగా  సాగుతోంది. ఉదయం 9:30 గంటల వరకు 16.15 శాతం ఓటింగ్​ నమోదైంది.

09:24 April 17

  • Urging all those voting in today’s fifth phase of the West Bengal elections to vote in large numbers. First time voters in particular should exercise their franchise.

    — Narendra Modi (@narendramodi) April 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బంగాల్ ఐదో దశ ఓటర్లను భారీగా పోలింగ్​కు రావాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. "పెద్ద సంఖ్యలో ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా.. తొలిసారి ఓటు వేసేవారు తప్పక తమ హక్కును వినియోగించుకోవాలి."

09:23 April 17

  • मैं बंगाल के पाँचवे चरण के सभी मतदाताओं से अपील करता हूँ कि अधिक से अधिक संख्या में मतदान करें।

    आपका एक वोट प्रदेश के गरीब व किसानों को उनका अधिकार, युवाओं को रोजगार और बंगाल के गौरव को पुनर्स्थापित करने में अहम भूमिका निभाएगा।

    — Amit Shah (@AmitShah) April 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఐదో దశ పోలింగ్​కు ఓటర్లను భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు హోంమంత్రి అమిత్ షా.  "పెద్ద ఎత్తున ఓటింగ్​కు తరలిరావాలని బంగాల్ ఓటర్లను కోరుతున్నా. రైతుల హక్కులు, యువతకు ఉద్యోగావకాశాలు, బంగాల్​ కీర్తి పునరుద్ధరణలో ప్రతి ఓటూ కీలకమే." అని ట్వీట్ చేశారు.

08:56 April 17

  • West Bengal Minister and TMC candidate from Bidhannagar, Sujit Bose visits polling booth in East Calcutta Girls College in the assembly constituency, as polling in the fifth phase of assembly elections is underway pic.twitter.com/kZ0kabfCy0

ఈస్ట్​ కోల్​కతా మహిళా కళాశాలలోని పోలింగ్​ బూత్​ను రాష్ట్ర మంత్రి సుజిత్ బోస్ సందర్శించారు. ఆయన బిధాన్​నగర్​ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరపున పోటీచేస్తున్నారు. 

06:59 April 17

బంగాల్​లో ఐదో విడత పోలింగ్ ప్రారంభమైంది. కామర్హతిలోని పోలింగ్ బూత్​ల​ వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

06:30 April 17

ప్రశాంతంగా ఐదో విడత పోలింగ్​

అధికార తృణమూల్​ కాంగ్రెస్​, భాజపా మధ్య నువ్వా-నేనా అనే విధంగా పోటీ నెలకొన్న బంగాల్లో శనివారం ఐదోదశ పోలింగ్‌ ప్రారంభమైంది . ఎన్నికలు జరగనున్న 45 స్థానాల్లో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కస్థానం కూడా గెలవని భాజపా 2019 పార్లమెంటు ఎన్నికల్లో తృణమూల్​పై ఆధిక్యం చాటుకుంది. మళ్లీ అదేజోరు కొనసాగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఉత్తర పరగణాలులో 16 స్థానాలు, తూర్పు వర్ధమాన్‌, నదియాలో 8, జాల్‌పాయ్‌గుడీలో ఏడు, డార్జీలింగ్‌లో ఐదు, కాలీంపాంగ్‌లో ఒక నియోజకవర్గానికి ఓటింగ్‌ జరగనుంది. వివిధపార్టీల తరఫున పోటీలో ఉన్న 342 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని కోటీ 13లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. 15వేల 789 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఓటింగ్‌ జరగనుంది.

మంత్రి బ్రత్యబసు, భాజపా నేత సామిక్‌ భట్టాచార్య, సిలిగుడి మేయర్‌, లెఫ్ట్‌ నేత అశోక్‌ భట్టాచార్య తదితరులు ఈ విడతలో పోటీ చేస్తున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఈ 45 నియోజకవర్గాల్లో టీఎంసీ కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం సాధించింది. అదే 2016 శాసనసభ ఎన్నికల్లో టీఎంసీ 32 సీట్లు గెలుపొందగా కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి 10స్థానాలు కైవసం చేసుకుంది. భాజపా మాత్రం ఖాతా కూడా తెరవలేదు.

పటిష్ఠ బందోబస్తు..

ఐదో విడత పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. కూచ్‌బిహార్‌ కాల్పుల ఘటన నేపథ్యంలో 48 గంటలకు బదులు 72 గంటల ముందుగానే ప్రచారాన్ని నిలిపి వేసింది. నాలుగో విడతలో రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఐదుగురు చనిపోవటంతో ఈసీ అప్రమత్తమైంది. పోలింగ్‌ జరిగే 45 నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర పోలీసులతోపాటు 853 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది.

బంగాల్​లో ఇప్పటివరకు నాలుగు దశల్లో 135 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరో 159 స్థానాలకు ఏప్రిల్​ 17- 29 మధ్యలో పోలింగ్​ జరగనుంది. మే 2న ఫలితాలు ప్రకటించనున్నారు.

కరోనా విజృంభిస్తున్నా..

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. అయినప్పటికీ పోలింగ్​ నిర్వహించేందుకే ఈసీ మొగ్గు చూపింది. ఈసారి మరిన్ని ఏర్పాట్లు చేసింది. అందరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఓటేసేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది.

బంగాల్​లో గురువారం 6 వేల 769 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. మరో 22 మంది చనిపోయారు.

Last Updated : Apr 17, 2021, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.