ETV Bharat / bharat

'బంగాల్​ ప్రశాంతత కోసం భాజపాను ఓడించండి' - mamata fires on bjp

పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భాజపాకు అవకాశం ఇవ్వకండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

mamata, bengal cm
'బంగాల్​లో కమలాన్ని వికసించనీయకండి'
author img

By

Published : Feb 11, 2021, 6:49 PM IST

Updated : Feb 11, 2021, 8:00 PM IST

బంగాల్​లో భాజపాను అధికారంలోకి రానివ్వకండి అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఇలా శాంతియుతంగానే ఉండాలన్నారు. కోల్​కతాలో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన దీదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు.

mamata
ప్రసంగిస్తున్న సీఎం మమతా బెనర్జీ

"బంగాల్​ను ప్రశాంతంగా ఉండనివ్వండి. భాజపాకు అధికారం పొందే అవకాశం ఇవ్వకూడదు. రాష్ట్ర గౌరవాన్ని కాపాడమని నేను మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా భాజపాకు సవాల్​ విసురుతున్నాను. మీరు కాంగ్రెస్​, లెఫ్ట్​ పార్టీల మద్దతు కూడా తీసుకోండి, తృణమూల్​ ఒంటరిగానే పోటీ చేస్తుంది. మీ ప్రయత్నాలను నేను అడ్డుకుంటాను."

-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

బంగాల్​ కావాలా మీకు..?

భాజపాపై దీదీ మండిపడ్డారు. 'రైతుల వద్ద లూటీ చేశారు, హింసకు పాల్పడ్డారు.. ఇప్పుడు మీకు బంగాల్​ కావాలా' అంటూ మమత ధ్వజమెత్తారు. తృణమూల్ కాంగ్రెస్సే​ బంగాల్​లో పరిపాలన కొనసాగిస్తుందన్నారు.

ఇదీ చదవండి : '18 ఏళ్లలోపు ముస్లిం యువతులు పెళ్లికి అర్హులే!'

Last Updated : Feb 11, 2021, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.