కరోనా కారణంగా ఎందరో నిరుద్యోగులయ్యారు. అలాంటివారిలో బంగాల్‌కు చెందిన పార్థా మండల్ ఒకరు. దుబాయ్‌లో షెఫ్‌గా పనిచేసిన మండల్.. మహమ్మారి కారణంగా ఉద్యోగం పోవడం వల్ల స్వస్థలానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో వినూత్నంగా ఆలోచించాడు. మొబైల్ రెస్టారెంట్‌కు రూపకల్పన చేశాడు.
ఎలా ఉంటుంది?..
తూర్పు వర్ధమాన్ జిల్లా మెమారీకి చెందిన మండల్.. ఓ ట్రక్కును రెస్టారెంట్లా మార్చివేశాడు. రెండు అంతస్తులుగా తీర్చిదిద్దాడు. మొదటిది వంట గదిలా మార్చాడు. పై అంతస్తును డైనింగ్ హాల్లా చేశాడు. మెట్ల సహాయంతో కస్టమర్లు చేరుకునే సదుపాయం కల్పించాడు. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఇందులో ఒకేసారి 50 మంది తినేలా ఏర్పాట్లు చేశాడు.
"నేను మొదటిసారి ఈ రెస్టారెంట్‌కు వచ్చా. ఇది చాలా ప్రత్యేకమైనది. ఆహారం చాలా రుచిగా ఉంది. కస్టమర్లను మర్యాదగా చూసుకుంటున్నారు. నా స్నేహితులతో చాలా ఎంజాయ్ చేశాను."
-సిమ్రాన్ బిశ్వకర్మ
సమస్యలోంచే ఆలోచన..
మండల్.. 2013లోనే హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశాడు. అ తర్వాత ఉద్యోగ రీత్యా దుబాయ్ వెళ్లాడు. 2020లో కరోనా సంక్షోభంతో హోటల్ రంగం దెబ్బతింది. దీంతో మండల్ ఉద్యోగం కోల్పోయాడు. తప్పని స్థితిలో స్వగ్రామానికి చేరుకున్నాడు. సమస్యలోంచే ఆతడికి వినూత్న ఆలోచన వచ్చింది. అందరికన్నా భిన్నంగా ఓ రెస్టారెంట్‌ను స్థాపించాలనుకున్నాడు. తాను దుబాయ్‌లో చూసిన మొబైల్ రెస్టారెంట్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఇలా చేశాడు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరిగే చోటుకు నేరుగా ఈ మొబైల్ రెస్టారెంట్‌తో వచ్చేసి... రుచికరమైన ఆహారం అందిస్తానని చెబుతున్నాడు మండల్.
ఇదీ చదవండి:రెండేళ్ల 'సూపర్ కిడ్'- ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు